Nadendla Manohar : జనసేన సభకు ఆటంకాలు కలిగించొద్దు- అధికారులకు నాదెండ్ల విజ్ఞప్తి

అధికార, అహంకారంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. సీఎం అహంకారానికి, సామాన్యుల ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం ఇది.(Nadendla Manohar)

Nadendla Manohar : జనసేన సభకు ఆటంకాలు కలిగించొద్దు- అధికారులకు నాదెండ్ల విజ్ఞప్తి

Nadendla Manohar

Nadendla Manohar : మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. దీనిపై జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇప్పటం దగ్గర జనసేన సభ ఉంటుందని తెలిపారు. రేపటి సభలో జనసైనికులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తారని వెల్లడించారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో కర్తవ్యబోధ చేస్తారని వివరించారు.

ఓ ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందని నాదెండ్ల అన్నారు. కాగా, ఈ సభకు ఆటంకం కలిగించొద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారాయన. రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. జగన్ అహంభావం, సామాన్యుల ఆత్మగౌరవానికి పోరాటమే ఈ సభ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన పార్టీ లక్ష్యమని అన్నారు.(Nadendla Manohar)

Pawan Kalyan : ఆవిర్భావ దినోత్సవం మన హక్కు.. అందరూ రండి-పవన్ కళ్యాణ్

”జమసేన సభకు మంచి ఏర్పాట్లు చేశాం. నిండు మనస్సుతో జనసైనికులకు స్వాగతం పలుకుతున్నాం. అద్భుతమైన రాజకీయ వేదికగా సభ సాగుతుంది. పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతుంది. విదేశాల నుంచి కూడా అభిమానులు వస్తున్నారు. అధికార, అహంకారంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి అహంకారానికి, సామాన్యుల ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం ఇది.

వాలంటీర్లుగా 1100 మంది పూర్తి సహకారం అందిస్తున్నారు. జనసేన సభకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుంది. ఎదుర్కోటానికి మేము సిద్దమే. జనసేన పార్టీ.. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అధికార యంత్రాంగం జనసైనికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారులు దయచేసి ఇబ్బందులు పెట్టవద్దు. రైతులు, మహిళలు సభను విజయవంతం చేయనున్నారు. సంస్కృతి ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఉంటాయి” అని నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.(Nadendla Manohar)

ఈ సభపై నాగబాబు సైతం స్పందించారు. సభ కోసం 2 నెలలుగా పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కష్టపడ్డారని చెప్పారు. ఆవిర్భావ సభకు వస్తున్న అభిమానులకు స్వాగతం పలికారు నాగబాబు. జాగ్రత్తగా రండి… క్షేమంగా వెళ్లండి.. అని నాగబాబు కోరారు.

Pawan kalyan : గుంటూరు జిల్లాలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌.. ఫ్లెక్లీలు, బ్యానర్లు తొలగింపు వివాదం

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఈ నెల 14న మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సభకు అందరికీ ఆహ్వానం పలికారు. జనసేన పార్టీ స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని, మార్చి 14న 9వ ఏట అడుగుపెడుతోందని ఆయన తెలిపారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని ఇప్పటం గ్రామం వద్ద జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేశామని పవన్ చెప్పారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు, వీర మహిళలు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. సభలో వీరమహిళలు కూర్చునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. ఈ సభ కోసం జనసేన నాయకులు గత 10 రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. అందరూ తమ తమ ప్రాంతాల నుంచి క్షేమంగా ఇక్కడికి చేరుకుని సభను జయప్రదం చేయాలని కోరారు.