రూ.22 లక్షల కారు అమ్మేశాడు.. ఆక్సిజన్ సహాయం చేస్తున్నాడు..
భారత్ లో ప్రస్తుతం COVID-19 సెకండ్ వేవ్ ప్రమాదకర స్థితికి నెట్టివేసింది. లక్షలాది మంది మహమ్మారి బారిన పడుతున్నారు.. ప్రతిరోజూ వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. రోగులకు చికిత్స చేయడానికి వైద్యులు..

Oxygen
man sells his Rs 22 lakh SUV : భారత్ లో ప్రస్తుతం COVID-19 సెకండ్ వేవ్ ప్రమాదకర స్థితికి నెట్టివేసింది. లక్షలాది మంది మహమ్మారి బారిన పడుతున్నారు.. ప్రతిరోజూ వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. రోగులకు చికిత్స చేయడానికి వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు విరామం లేకుండా పని చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో 3,00,000 కంటే ఎక్కువ కేసులు, వెయ్యికి పైగా మరణాలు సంభవించడంతో, దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం కుప్పకూలిపోయే స్థాయికి విస్తరించింది. ఆసుపత్రి పడకలు, ఐసియులు, ఆక్సిజన్ సిలిండర్లు, ప్రాణాంతక వైరస్‌తో పోరాడటానికి అవసరమైన ఇతర వస్తువులను కోరుకునే వ్యక్తుల అభ్యర్థనలతో సోషల్ మీడియా నిండిపోతుంది. ఆక్సిజన్ సంక్షోభం, ముఖ్యంగా, అనేక ఆసుపత్రులను నిర్వీర్యం చేసింది, దీనికి కారణం వేలాది మంది ప్రాణాలు దానిపై ఆధారపడి ఉండటమే..
ఇలాంటి సమయంలో ముంబైకి చెందిన షహ్నావాజ్ షేక్ అనే వ్యక్తి తన మానవత్వాన్ని చాటుకున్నారు.. తాను చేసే సహాయం ద్వారా ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవాలన్న విషయాన్నీ పలువురికి గుర్తుచేస్తున్నారు. స్థానిక ప్రాంతంలో ‘ఆక్సిజన్ మ్యాన్’ అని కూడా పిలువబడే హీరో అతను.. మలాడ్ ప్రాంతానికి చెందిన షహ్నావాజ్ ఆక్సిజన్ లేక విలవిలలాడుతున్న COVID-19 రోగులకు ఆక్సిజన్ సిలిండర్ అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. అది ఎంతలా అంటే ఎంతో ఇష్టపడి కొనుక్కున్న తన కారును రూ.22 లక్షలకు అమ్మివేసి.. ఆ వచ్చిన డబ్బుతో ఆక్సిజన్ సిలిండర్లను కోనుగోలు చేస్తున్నాడు.. వాటిని దగ్గర్లోని గవర్నమెంటు ఆసుపత్రులకు ఇచ్చి కోవిడ్ రోగులకు వినియోగించాలని సూచిస్తున్నారు.
గత సంవత్సరం పేదలకు సహాయం చేస్తున్నప్పుడు డబ్బు అయిపోవడంతో, ఈసారి తన కారును అమ్మవలసి వచ్చిందని షానవాజ్ చెప్పారు. ఈ సహాయం చెయ్యడానికి ఓ పెద్ద కారణం ఉందని అన్నారాయన.. గతేడాది తన స్నేహితుడి భార్య అనారోగ్యం బారిన పడి.. ఆటో రిక్షాలో వెళుతూ ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణించారని.. ఇది చూసిన తాను చలించిపోయానని.. అందుకే ఆక్సిజన్ సహాయం చేస్తున్నానని అన్నారు. ఏదిఏమైనా కరోనాకష్టకాలంలో ఆపధబాంధవుడిలా వచ్చి తమను ఆదుకుంటున్నందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు కొందరు రోగులు.