Mumbai Murder: వంద రూపాయల అప్పు తిరిగివ్వలేదని హత్య
అప్పుగా ఇచ్చిన రూ.100 తిరిగివ్వలేదని ఆవేశంలో తోటి కార్మికుడిని హత్య చేశాడో వ్యక్తి. ముంబైలోని గిర్గామ్ పనిచేస్తున్న అర్జున్ యశ్వంత్ సింగ్ సర్హార్ రాజస్థాన్ నుంచి వలస వచ్చాడు.

Mumbai Murder 10tv
Mumbai Murder: అప్పుగా ఇచ్చిన రూ.100 తిరిగివ్వలేదని ఆవేశంలో తోటి కార్మికుడిని హత్య చేశాడో వ్యక్తి. ముంబైలోని గిర్గామ్ పనిచేస్తున్న అర్జున్ యశ్వంత్ సింగ్ సర్హార్ రాజస్థాన్ నుంచి వలస వచ్చాడు. స్థానికంగా రోజుకూలీగా వెళ్తుండేవాడు. ఓ రోజు తన కొలీగ్ అయిన మనోజ్ మరజ్‌కోలె(36)ను వంద రూపాయలు అప్పుగా అడిగి తీసుకున్నాడు.
‘గురువారం రాత్రి ఇద్దరూ డబ్బుల గురించి జరిగిన వాదనలో ఘర్షణకు దిగారు. ఆ తర్వాత మాధవ్ భవన్ కాంపౌండ్ ఏరియాలో పడుకోవడానికి సర్హార్ వెళ్లిపోయాడు. తెల్లవారితే శుక్రవారం నాలుగున్నర గంటల సమయంలో సిమెంట్ రాయి తీసుకుని వెళ్లాడు మరజ్‌కోలె.
తన సహచరుడైన అర్జున్ తలపై విసిరి హత్య చేశాడు. చనిపోయాడనే భయంతో అక్కడే దాక్కొని ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కొద్ది గంటల వ్యవధిలోనే వీపీ రోడ్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. మంగళవారం వరకూ అతణ్ని అదుపులో తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.