Mumbai Mosque : లౌడ్ స్పీకర్ల విషయంలో ముంబై జామా మసీదు కీలక నిర్ణయం
లౌడ్ స్పీకర్ల విషయంలో ముంబై జామా మసీదు కీలక నిర్ణయం తీసుకుంది.

Mira Road Jama Mosque Lower Decibel For Azaan
Mira Road Jama mosque lower decibel for azaan : మసీదుల్లో అజాన్ సమయంలో పెద్ద సౌండ్ తో లౌడ్ స్పీకర్లు పెట్టడంపై దేశవ్యాప్తంగా ఇతర మత వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇటువంటి అభిప్రాయాలు వస్తున్న సమయంలో ముంబైలోని ఒక మసీదు కీలక నిర్ణయం తీసుకుంది. మిరా రోడ్డులోని జామా మసీదు అల్ షామ్స్.. లౌడ్ స్పీకర్ల నుంచి బయటకు వచ్చే శబ్దాన్ని నిబంధనలకు అనుగుణంగా తగ్గించాలని నిర్ణయించింది.
మిరా రోడ్డులోని జామా మసీదు చీఫ్ ముజఫర్ హుస్సేన్ దీని గురించి మాట్లాడుతూ.. రోజులో ఐదు సార్లు అజాన్ చేసే సమయంలో లౌడ్ స్పీకర్ల నుంచి విడుదలవుతున్న శబ్దాల స్థాయిని ఇంజనీర్లు అంచనా వేసి ఈ విషయాన్ని గురువారం (ఏప్రిల్ 14,2022)వెల్లడించారు. ఇది పూర్తయిన తర్వాత శబ్దాల స్థాయిని.. వాణిజ్య ప్రాంతాల్లో నిబంధనల కింద అనుమతించిన మేరకు తగ్గింస్తామని ప్రకటించారు. జామా మసీదు వాణిజ్య ప్రాంతం పరిధిలోకి వస్తుందన్నారు.
మరోపక్క, మే 3 నాటికి మసీదులపై స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ఇప్పటికే హెచ్చరికలు చేశారు. లేదంటే మసీదుల ముందు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. దీనిపై హుస్సేన్ పలు అంశాలను గుర్తు చేశారు.మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం లేదనే విషయాన్ని తెలిపారు.
ప్రార్థనా స్థలాల నుంచి లౌడ్ స్పీకర్లు ఎవరూ తొలగించలేరని, అందరూ నిబంధనలకు కట్టుబడాలని అన్నారు. కర్ణాటకలో కొన్ని హిందూ సంస్థలు మసీదుల లౌడ్ స్పీకర్లు తొలగించాలని, లేదంటే తాము హనుమాన్ చాలీసాను పెద్దగా స్పీకర్లలో పెడతామంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.