Mumbai Terrer Attack : ముంబైలో 26/11 తరహా దాడులు చేస్తామని ఉగ్రవాదులు బెదిరింపులు..అప్రమత్తమైన పోలీసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దాడులకు పాల్పడుతాం అంటూ ఉగ్రవాదులు నుంచి బెదిరింపులు వచ్చాయి. ముంబైలో 26/11 తరహా దాడులు చేస్తామని దాని కోసం అన్ని సిద్ధం చేసుకున్నామని ప్లాన్ కూడా సిద్దమైంది అంటూ పేర్కొన్నారు ఉగ్రవాదులు.

mumbai police traffic control receiver threat message to terrer attack mumbai
mumbai police traffic control receiver threat message to terrer attack : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దాడులకు పాల్పడుతాం అంటూ ఉగ్రవాదులు బెదిరింపులు వచ్చాయి. ముంబైలో 26/11 తరహా దాడులు చేస్తామని దాని కోసం అన్ని సిద్ధం చేసుకున్నామని ప్లాన్ కూడా సిద్దమైంది అంటూ పేర్కొన్నారు ఉగ్రవాదులు. దీని కోసం ఇప్పటికే భారత్ లో ఆరుగురు మా ప్లాన్ లో భాగస్వామ్యం అయ్యారు అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.
ముంబై పోలీసుల ట్రాఫిక్ కంట్రోల్ వాట్సాప్ నంబర్ కు ఒక మెసేజ్ వచ్చింది. దాంట్లో ముంబైలో 26/11 తరహా దాడులు చేస్తామని దాని కోసం భారత్ లో ఆరుగురు మాతో కలిసారు అని పేర్కొన్నారు. ఉగ్రవాదుల బెదిరింపులపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాకిస్థాన్ నుంచి ఈ బెదిరింపులు సందేశం వచ్చినట్లుగా పోలీసుల యంత్రాంగం భావిస్తోంది. దీంతో ముంబైలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించే పనిలో పడ్డారు. ప్రతీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
కాగా.. మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో ఓ అనుమానాస్పద బోట్ తీవ్ర కలకలం సృష్టించింది. ముంబై రాయ్ ఘడ్ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ బోట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బోట్ నుంచి 3AK 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులు అంత్యంత అప్రమత్తంగా ఉన్నారు.