Mumbai Police : వినాయకుడిని పోలీస్ చేసేశారు…ఐపీఎస్ ఆఫీసర్
వినాయకుడిని పోలీస్ ను చేశారు ముంబై పోలీసులు. ఐపీఎస్ ఆఫీసర్ అవతారంలో ఉన్న వినాయకుడు అందర్నీ ఆకర్షిస్తున్నాడు.

Mumbai
Ganpati Bappa IPS Officer : వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక నిమజ్జనానికి తరలివెళ్లడానికి గణనాథుడు సిద్ధంగా ఉన్నాడు. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా..పలు రాష్ట్రాలు నిబంధనలు, ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కొంతమంది వినాయకులను వినూత్నంగా ఏర్పాటు చేశారు. సరికొత్తగా ఉన్న వినాయకుడి ప్రతిమలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More : Gujarat : బిస్కెట్ ప్యాకెట్లతో శివలింగం..మధ్యలో వినాయకుడు
వివిధ రకాలుగా తమకు తోచిన విధంగా వినాయకుడిని ఏర్పాటు చేశారు. అయితే…వినాయకుడిని పోలీస్ ను చేశారు ముంబై పోలీసులు. ఐపీఎస్ ఆఫీసర్ అవతారంలో ఉన్న వినాయకుడు అందర్నీ ఆకర్షిస్తున్నాడు. ఇండియా ప్రీమియర్ సెక్యూర్టీ కొత్త ఆఫీసర్ ఛార్జీ తీసుకున్నారని, ఆయనకు వెల్ కమ్ చెప్పాలంటూ…గణేశ్ విగ్రహాన్ని ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్టు చేశారు.
Read More : Vaccine Vinayaka : వ్యాక్సిన్ వినాయకుడు..టీకా వేయించుకుంటేనే రమ్మంటున్నాడు..
ఐపీఎస్ ఆఫీసర్ గణపతి బప్పా ప్రస్తుతం విల్లెపార్లె పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేంద్ర కానే ఇంట్లో పోస్టింగ్ తీసుకున్నారని వివరించారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బెస్ట్ సెక్యూర్టీ ఇంతకన్నా ఎవరుంటారు. వినాయకుడే పోలీస్ ఆఫీసర్ అయితే..క్రైమ్ అనేది ఉండదంటూ సరదా సరదా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram