ముంబైలో ఓటు వేసిన సచిన్ టెండూల్కర్ 

  • Published By: veegamteam ,Published On : October 21, 2019 / 07:03 AM IST
ముంబైలో ఓటు వేసిన సచిన్ టెండూల్కర్ 

Updated On : October 21, 2019 / 7:03 AM IST

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అసెంబ్లీ పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్ర ముంబైలో బాద్రాలోని  పోలింగ్ బూత్‌లో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సచిన్ తో పాటు అతని భార్య అంజలి, కుమారుడు అర్జున్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం (2019, అక్టోబర్ 21) 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓట్లు వేసేందుకు ఓటర్లు భారీగా తరలివచ్చారు. 

ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రముఖులు భారీగా తరలి వచ్చారు. నటుడు గోవింద, భార్య సునీత పశ్చిమ అంధేరిలోని పోలింగ్ బూత్ వద్ద ఓటు వేశారు. మాజీ న‌టుడు ప్రేమ్ చోప్రా, డైర‌క్ట‌ర్‌-గేయ ర‌చ‌యిత గుల్జార్‌.. బాంద్రాలోని ఓ పోలింగ్ బూత్‌లో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప్రీతీజింతా, సుభాష్ ఘాయ్‌, వ‌రుణ్ ధావ‌న్‌, గోవిందా, జాన్ అబ్ర‌హాం, ఖైలాష్ ఖేర్‌, దియా మీర్జాలు కూడా ఓటేశారు. ఇక శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ థాక‌రే, ఆయ‌న భార్య రెష్మి కూడా ఓటేశారు. బాంద్రా ఈస్ట్‌లో శివ‌సేన అధినేత ఓటేశారు. ఆదిత్య, తేజ‌స్ థాక‌రేలు కూడా త‌మ ఓటును వినియోగించుకున్నారు. ఓర్లీ ముంబై నుంచి ఆదిత్య థాక‌రే .. ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ నాగ్పూర్‌లో, ఎన్‌సీపీ సీనియర్ లీడర్ సుప్రియా సూలే బారమతిలో ఓటు వేశారు.