Elon Musk: మరో కీలక నిర్ణయం తీసుకున్న మస్క్.. ట్రస్ట్ అండ్ సేప్టీ కౌన్సిల్ రద్దు ..
ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్లో విద్వేష ప్రసంగాలు, బాలలపై అకృత్యాలు, ఆత్మహత్యలు, స్వీయ హాని సహా ఇతర సమస్యలను ట్విటర్‌లో సమర్థంగా ఎందుర్కొనేందుకు 2016లో అప్పటి యాజమాన్యం ఈ స్వతంత్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కౌన్సిల్ రద్దు చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు.

Elon Musk
Elon Musk: ట్విటర్ అధిపతి ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాల పరపర కొనసాగుతూనే ఉంది. అన్ని విభాగాల్లో ఉద్యోగుల తొలగింపును చేపట్టిన మస్క్.. దాదాపు సగం మంది ఉద్యోగులను ట్విటర్ నుంచి తొలగించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్లో విద్వేష ప్రసంగాలు, బాలలపై అకృత్యాలు, ఆత్మహత్యలు, స్వీయ హాని సహా ఇతర సమస్యలను ట్విటర్ లో సమర్థంగా ఎందుర్కొనేందుకు 2016లో అప్పటి యాజమాన్యం ఈ కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది.
ఈ కౌన్సిల్ లో మొత్తం 100 మంది స్వతంత్ర సభ్యులు ఉండేవారు. పలు పౌర, మానవతా సంస్థలకు చెందిన వ్యక్తులు తమ సేవల్ని అందించేవారు. తాజాగా ట్రస్ట్ అండ్ సేప్టీ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లు ట్విటర్ అధినేత మస్క్ ప్రకటించారు. సోమవారం రాత్రి కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. సమావేశంకు కొద్దిగంటల ముందుకు మస్క్ ఈ నిర్ణయం తీసుకొని సభ్యులకు షాకిచ్చాడు. మెయిల్ ద్వారా సభ్యులకు ఈ సమాచారాన్ని అందించారు.
Twitter: బ్లూ టిక్ చార్జీలను ప్రకటించిన ట్విట్టర్
అయితే దానిలో మస్క్ పలు కీలక అంశాలు జోడించారు. ట్విటర్ మరింత భధ్రమైన, సమాచారంతో కూడిన నివేదికగా తీర్చిదిద్దుతామని దాంట్లో పేర్కొన్నారు. పైగా ఈ చర్యల్ని గతంతో పోలిస్తే చాలా వేగంగా చేపడతామని, ఈ విషయాల్లో మాత్రం అందరి సలహాలను తీసుకుంటామని మస్క్ అన్నారు.