భార్య ఇంటిని వదిలి వెళ్లిందని భర్త ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : September 6, 2020 / 07:41 AM IST
భార్య ఇంటిని వదిలి వెళ్లిందని భర్త ఆత్మహత్య

Updated On : September 6, 2020 / 8:08 AM IST

భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోవడంతో మద్యానికి బానిసైన ఇతనికి, భార్య మధ్య వాగ్వాదాలు జరుగుతుండేది. ఈ ఘటన నాగ్ పూర్ లో చోటు చేసుకుంది.




చనిపోయిన వ్యక్తి అమర్ శివలాల్ చౌదరిగా గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది.

తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని, అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు లేఖలో వెల్లడించాడని Ajni police station అధికారి తెలిపారు.