కరోనా వ్యాక్సిన్ల దిగుమతిపై కస్టమ్ సుంకం 3 నెలలు రద్దు
దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంచడానికి తీసుకున్న చర్యలను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాను..

Narendra Modi Chaired A Meeting To Review Steps Taken To Boost Oxygen Availability
Custom tariff abolished for vaccines : దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంచడానికి తీసుకున్న చర్యలను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాను పెంచడంతో పాటు, ఇల్లు మరియు ఆసుపత్రులలో రోగుల సంరక్షణకు అవసరమైన పరికరాలను అందించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
ఆక్సిజన్, వైద్య సామాగ్రి లభ్యత కోసం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. 3 నెలల పాటు ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సెస్ విధించరాదని కూడా నిర్ణయించారు.
అటువంటి పరికరాలను దిగుమతి చేసుకోవడంపై కస్టమ్ క్లియరెన్స్ ఇవ్వాలని కూడా పిఎం మోదీ రెవెన్యూ శాఖను ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ల దిగుమతిపై ప్రాథమిక కస్టమ్ సుంకాన్ని 3 నెలలు రద్దు చేయాలని కూడా నిర్ణయించారు.