Narendra Modi: మోదీజీ.. అధికారంలోకి వచ్చి 20ఏళ్లు!

రాజ్యాంగబద్ధమైన పదవిలో ప్రధాని మోదీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు.

Narendra Modi: మోదీజీ.. అధికారంలోకి వచ్చి 20ఏళ్లు!

Updated On : October 7, 2021 / 7:28 AM IST

Narendra Modi: రాజ్యాంగబద్ధమైన పదవిలో ప్రధాని మోదీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ సంధర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ యూత్, నాయకులు బూత్ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తుంది.

భారతీయ జనతా పార్టీ అక్టోబర్ 7వ తేదీ నుంచి వరుస కార్యక్రమాలను సిద్ధం చేసింది. పార్టీ కార్యకర్తలు నదులను శుభ్రం చేయడం, కేక్ కటింగ్‌లు చెయ్యడం ద్వారా బూత్ స్థాయిలో ఇతర సామాజిక కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజుకి అంటే అక్టోబర్ 7వ తేదీ నాటికి అధికారం చేపట్టి 20ఏళ్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగబద్ధమైన పదవిలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ తన రాజ్యాంగబద్ధమైన పదవిలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ప్రధానిగా ఏడేళ్లు.. ముఖ్యమంత్రిగా 13ఏళ్లు ఉన్నారు నరేంద్రమోడీ. 2014లో దేశప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఏడేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు. ముఖ్మమంత్రిగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ.. ప్రధానిగా కూడా ఏడేళ్లలో తన మార్క్ చూపించారు.

స్వచ్ఛ భారత్‌ అభియాన్, నోట్లరద్దు, సర్జికల్‌ స్ట్రైక్స్, వైమానిక దాడి, ఆర్టీకల్‌ 370 రద్దు, ఆర్టీకల్‌ 370 రద్దు, ముస్లిం మహిళా వివాహ హక్కు రక్షణ(తలాఖ్ రద్దు), నూతన విద్యా విధానం, జన్‌ ధన్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్ వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. రెండు సార్లు వరుసగా కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకుని వచ్చారు ప్రధాని మోదీ.