నోటి దూల : రాహుల్‌కు మహిళా కమిషన్ నోటీసులు

  • Published By: madhu ,Published On : January 10, 2019 / 12:56 PM IST
నోటి దూల  : రాహుల్‌కు మహిళా కమిషన్ నోటీసులు

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తనను కాపాడుకోవడానికి ఓ మహిళను అడ్డం పెట్టుకున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో రాఫేల్‌ ఒప్పందంపై సీతారామన్‌ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ మాటలపై మహిళా కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.