Students Tested Covid Positive : కరోనా కలకలం.. ఒకే స్కూల్‌లో 18మంది విద్యార్థులకు కోవిడ్

పలు రాష్ట్రాల్లోని స్కూళ్లలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పాఠశాలలో 950 మందికి టెస్టులు చేయగా 18మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు..

Students Tested Covid Positive

Students Tested Covid Positive : అదుపులోకి వచ్చిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. క్రమంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థల్లో కరోనా మహమ్మారి కలవరం రేపుతోంది. పలు రాష్ట్రాల్లోని స్కూళ్లలో కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మహారాష్ట్ర నవీ ముంబైలోని ఘన్సోలి పాఠశాలలో 950 మందికి టెస్టులు చేయగా 18మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా వారం రోజుల పాటు పాఠశాలను మూసివేశారు. అందులో ఒక విద్యార్థి తండ్రి ఇటీవలే ఖతార్ నుంచి వచ్చారు. అతడికి నెగిటివ్ వచ్చినా ముందు జాగ్రత్తగా అతడి కుమారుడి శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు.

ఒకే స్కూల్ లో 18మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతో నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా కట్టడికి చర్యలు చేపట్టారు. విద్యార్థుల కుటుంబసభ్యులు ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని, ఆ విద్యార్థులకు కోవిడ్ సంబంధ టెస్టులు చేస్తామని చెప్పారు.

Balakrishna : ‘అన్ స్టాపబుల్’ బాలయ్యతో మాస్ మహారాజ్

ప్రస్తుతం కరోనా కేసులు వెలుగు చూసిన స్కూల్ లోనే జూనియర్ కాలేజీ కూడా ఉంది. 8 రోజుల పాటు విద్యాసంస్థను మూసివేస్తున్నట్టు అధికారులు చెప్పారు. విద్యార్థులు, సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు పూర్తయ్యే వరకు స్కూల్ ని మూసి ఉంచుతామన్నారు. ఘన్సోలీ క్యాంపస్ లో మూడు బ్లాక్స్ ఉన్నాయి. మాస్కులు, శానిటైజర్లు కచ్చితంగా వాడాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరకు 80శాతం మంది విద్యార్థులు కోవిడ్ టెస్టులు చేశారు.

కరోనా బారిన పడ్డ వారిలో ఎక్కువమంది 11th స్టాండర్డ్ వాళ్లు ఉన్నారు. ఆ తర్వాత లోయర్ క్లాసుల విద్యార్థులు వాళ్లున్నారు. ఈ ఘటనతో అధికారులు విద్యాసంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని స్కూళ్ల యజమాన్యాలకు చెప్పారు. ప్రతి చోట శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. స్కూళ్ల టాయిలెట్ లో సబ్బులు ఉంచాలన్నారు. అలాగే భౌతిక దూరం పాటించాలని ఆదేశించారు.

Best Foods : రన్నింగ్, జాగింగ్ చేసే వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే…

అసలే ఓవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. మన దేశంలోనూ క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థల్లో మళ్లీ కరోనా కేసులు వెలుగుచూడటం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది.