Bharat : పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్.. మార్పునకు ఎన్సీఆర్టీ సిఫారసు

కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల నుంచి ఇండియా పేరును తీసేసి భారత్ అని చేర్చాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కమిటీ సిఫారసు చేసింది.

Bharat : పాఠ్యపుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్.. మార్పునకు ఎన్సీఆర్టీ సిఫారసు

text books Bharat

Updated On : October 26, 2023 / 9:06 AM IST

Text Books Bharat : దేశం పేరును ఇండియాకు బదులుగా భారత్ గా మార్చాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకం వ్యక్తమవుతోంది. దేశం పేరు మార్పుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలిచ్చిన నేపథ్యంలో ఇండియా పేరును పూర్తిగా మార్చే పని ఊపందుకుంది. కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల నుంచి ఇండియా పేరును తీసేసి భారత్ అని చేర్చాలని జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కమిటీ సిఫారసు చేసింది.

పాఠశాల స్థాయిలో అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియాను భారత్ గా మార్చటంతోపాటు ప్రాచీన చరిత్ర స్థానంలో క్లాసికల్ హిస్టరీని ప్రవేశపెట్టాలని, ప్రత్యేకంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టం (ఐకేఎస్)ను తీసుకురావాలని సిఫారసు చేసినట్లు కమిటీ చైర్ పర్సన్ సీఐ ఐసాక్ పేర్కొన్నారు. అయితే, కమిటీ సిఫారసుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ చైర్మన్ దినేష్ సక్లానీ వెల్లడించారు.

Ground Water : భారతదేశంలో భూగర్భజలాల క్షీణతపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక

భారత్ అనే పేరు ఏడు వేల ఏళ్ల పురాతనమైన విష్ణు పురాణంతో ఉపయోగించారని, అందుకే దేశాన్ని ఆ పేరుతో సంభోధించారని సచించినట్లు ఐసాక్ పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ సిఫారసుపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇండియాను భారత్ గా మార్చుతున్నట్లైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ను ఎందుకు కొనసాగిస్తున్నామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశ్నించారు.

ఎన్సీఈఆర్టీ ప్రతిపాదన పూర్తిగా ప్రజా వ్యతిరేకమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వారిపై ఒత్తిడి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. వివక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టినప్పటి నుంచి అధికార బీజేపీలో భయం మొదలైందని ఆర్ఎల్డీ పేర్కొన్నారు.