NEET 2022: నీట్ పరీక్ష వాయిదా లేదు.. రేపే అడ్మిట్ కార్డ్ రిలీజ్

నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET UG 2022 కోసం అభ్యర్థులు చేసిన డిమాండ్లను అథారిటీలు పట్టించుకోలేదు. ఇతర ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ తేదీలు దగ్గర్లో ఉండటంతో వాయిదా వేయాలంటూ ఆందోళనకు దిగారు.

NEET 2022: నీట్ పరీక్ష వాయిదా లేదు.. రేపే అడ్మిట్ కార్డ్ రిలీజ్

Neet Ug 2022 Registration Begins On The Official Website, Check The Exam Date

Updated On : July 11, 2022 / 8:58 PM IST

NEET 2022: నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET UG 2022 కోసం అభ్యర్థులు చేసిన డిమాండ్లను అథారిటీలు పట్టించుకోలేదు. ఇతర ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ తేదీలు దగ్గర్లో ఉండటంతో వాయిదా వేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ మేరకు NEET-UG 2022కు సంబంధించి అడ్మిట్ కార్డులను జులై 12న రిలీజ్ చేయనున్నారు.

ఈ సర్క్యూలర్ ను బట్టి చూస్తుంటే, NTA NEET UG పరీక్షను వాయిదా వేసే అవకాశాలు లేనట్లేనని స్పష్టమైంది. ఇది కన్ఫామ్ చేసుకోవాలంటే..

* NEET UG వెబ్‌సైట్ neet.nta.ac.in లో లాగిన్ అవ్వండి.
* అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌ను యాక్టివ్ చేసుకున్నాక నోటీస్ సెక్షన్‌ను చూడండి.
* ఆ లింక్ లోకి వెళ్లి క్రెడెన్షియల్స్ నింపండి.
* అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి.
* ముందుజాగ్రత్తగా హార్డ్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి.

Read Also : అదంతా ఫేక్.. నీట్‌ పీజీ పరీక్షపై NBEMS క్లారిటీ..!