Virat Kohli shadow portrait : విరాట్ కోహ్లీ షాడో ఆర్ట్ పోర్ట్రెయిట్ అదుర్స్.. దీని కోసం 3 రోజులు కష్టపడ్డ ఆర్టిస్ట్
విరాట్ కోహ్లీపై అభిమానులే కాదు ఆర్టిస్టులు అభిమానం చాటుకుంటున్నారు. ఆర్టిస్ట్ మౌర్య కూడా తన ఆర్ట్‌తో కోహ్లీకి ఎలాంటి రూపం ఇచ్చాడో చూడండి.

Virat Kohli shadow portrait
Virat Kohli shadow portrait : క్రికెటర్ విరాట్ కోహ్లీ అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలలో ఒకరు. అభిమానులే కాదు.. కళాకారులు కూడా అతనిని ఆరాధిస్తుంటారు. రీసెంట్‌గా ఆర్టిస్ట్, యూట్యూబర్ షింటూ మౌర్య విరాట్ కోహ్లీ షాడో ఆర్ట్ పోర్ట్రెయిట్ రూపొందించి అందరినీ ఔరా అనిపించారు.
Virat Kohli : విరాట్ కోహ్లి సంపాదన ఎంతో తెలుసా..? మరే క్రికెటర్‌కు కూడా సాధ్యం కాని రీతిలో
artioticzone అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో మౌర్య అగ్గిపెట్టెలు, పలుచగా ఉండే వుడ్ స్ట్రిప్స్ ఉపయోగించి ఓ ఆకారాన్ని తయారు చేశాడు. దీని కోసం మూడు రోజులు కష్టపడ్డాడు. ఆ ఆకారంపై వెలుగు పడేలా చేశాడు. అందరికీ నవ్వుతున్న కోహ్లీ కనిపిస్తాడు. ఈఆర్ట్ కోసం ఆర్టిస్ట్ మౌర్య పడ్డ కష్టం, దాని వెనుక కోహ్లీపై ఉన్న అభిమానం చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియోను చాలామంది విరాట్ కోహ్లీకి ట్యాగ్ చేశారు. ‘@virat.kohli మీరు దీన్ని చూసి అతని అద్భుతమైన ప్రతిభను, సృజనాత్మకతను అభినందించాలి’ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై విరాట్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇక విరాట్ కోహ్లీపై ఆర్టిస్టులు ఇలా రూపొందించడం ఇది మొదటిసారి కాదు. జూన్‌లో డిజిటల్ సృష్టికర్త షాహిద్ ప్రాంప్ట్-బేస్డ్ ఆర్ట్ టూల్ మిడ్ జర్నీని ఉపయోగించి AI ఆర్ట్ సిరీస్‌ను రూపొందించారు. ఇది విరాట్‌ని అనేక రూపాల్లో చూపించింది. కోహ్లీ రాజుగా, వ్యోమగామిగా, ఫుట్ బాల్ ప్లేయర్‌గా, డాక్టర్‌గా, వార్ జోన్‌లో సైనికుడిగా, పండ్లు అమ్మేవాడిగా, పైలట్‌గా కనిపించాడు. మేలో ఇండియాలోనే మొట్టమొదటి సన్ లైట్ ఆర్టిస్ట్ విఘ్నేశ్ ఒక చెక్క దిమ్మెపై భూతద్దం ద్వారా సూర్యకాంతిని ఉపయోగించి విరాట్ కోహ్లీ అద్భుతమైన చిత్రాన్ని చెక్కాడు. ఇలా అనేక రకాలుగా అభిమానులు కోహ్లీపై అభిమానం చాటుకుంటున్నారు.
View this post on Instagram