Delhi : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలేయండి.. లెహంగాలు అమ్మండి.. ఐఐటీ గ్రాడ్యుయేట్ సలహాకి నెటిజన్లు షాక్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలేసి .. లెహంగాలు అమ్ముకోండని ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ సలహా ఇవ్వడం వైరల్‌గా మారింది. దీనిపై ఇంటర్నెట్‌లో పెద్ద డిబేట్ జరిగింది.

Delhi : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలేయండి.. లెహంగాలు అమ్మండి.. ఐఐటీ గ్రాడ్యుయేట్ సలహాకి నెటిజన్లు షాక్

Delhi

Delhi : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేయండి.. లెహంగాలను అమ్మండి.. అంటూ ఢిల్లీకి చెందిన ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ అమిత్ జగ్లాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. అసలు అమిత్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకు అలా పోస్టు పెట్టారు? ఇంటర్నెట్‌లో బిగ్ డిబేట్‌కి దారి తీసింది.

Aamir Khan : చెన్నై వరదల్లో చిక్కుకున్న ఆమీర్ ఖాన్.. ఫోటోలు వైరల్..

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఐటీ ఉద్యోగాలు అంటే జీతాలు భారీగానే ఉంటాయి. అలాంటి ప్రొఫెషన్ స్థిరపడాలనేది కూడా ఇప్పటితరం యువత కల కూడా. అయితే IIT గౌహతి గ్రాడ్యుయేట్, అర్బన్ క్లాప్‌లో డిజైన్ డైరెక్టర్ అయిన అమిత్ జగ్లాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో ఒక్కసారిగా వైరల్ అయ్యారు. అమిత్ జగ్లాన్ (@iamjaglan) తన ట్విట్టర్ ఖాతాలో యువతను సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వదిలి పాత ఢిల్లీ చాందినీ చౌక్ మార్కెట్లో లెహంగా దుకాణాన్ని ప్రారంభించమని సలహా ఇచ్చారు. అందుకు కారణం అక్కడ ఖరీదైన లెహంగాలు హాట్ కేకుల్లాగ అమ్ముడవుతున్నట్లు ఆయన చూసారట.

Viral Video : నాతో ఎవరూ ఆడుకోరు.. తల్లిదండ్రుల గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్న4 ఏళ్ల బాలుడి వీడియో వైరల్

‘ఒక సలహా: మీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను వదిలి లెహంగాలను అమ్మండి. నేనే మాటలతో నష్టపోతున్నాను. రూ.1 లక్ష రూపాయల విలువైన లెహంగాలు కౌంటర్ల నుండి ఎగిరిపోతున్నాయి’ అనే శీర్షికతో అమిత్ జగ్లాన్ ట్విట్టర్ పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కంటే లెహంగాలు అమ్మడం చాలా కష్టం’ అని.. ‘మీరు చెప్పిన వ్యాపారం సీజనల్‌గా లాభాలు ఇస్తుంది.. ఉద్యోగం రెగ్యులర్‌గా ఆదాయాన్ని ఇస్తుందని’ నెటిజన్లు రిప్లై చేశారు. అయితే తన ట్వీట్‌ను అక్షరాల పాటించమని చెప్పడం లేదని భారతదేశంలో గొప్ప వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి తాను పోస్టు పెట్టానని అమిత్ జగ్లాన్ వారికి రిప్లై చేశారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ పెళ్లి దుస్తులకు ప్రసిద్ధి. ఇక్కడ భారీ ఎత్తున విక్రయాలు జరుగుతుంటాయి.