Corona Cases : దేశంలో 7,774 కరోనా కేసులు.. రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 7774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది.

Corona Cases (4)
Corona Cases : దేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 7774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది. ఇందులో 3,41,22,795 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. మరో 4,75,434 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో కొత్తగా 306 మంది మరణించగా, 8464 మంది కోలుకున్నారని వెల్లడించారు. ఇక శనివారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా 1,32,93,84,230 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
చదవండి : Corona In Telangana : తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు, ఒకరు మృతి
మరో వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతుంది. ఇప్పటివరకు 33 మందిలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారిన పడినట్లు వివరించారు అధికారులు.మరికొందరి శాంపిల్స్ ల్యాబ్స్ కి పంపినట్లు తెలిపారు. ఓ వైపు ఒమిక్రాన్, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివిటి రేటు పెరగడంతో కేంద్రం నిఘ్ కర్ఫ్యూ పై మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రాలు అవసరమనుకుంటే నైట్ కర్ఫ్యూ విధించాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.
చదవండి : Night Curfew In Jammu : పెరుగుతున్న కోవిడ్ కేసులు..జమ్మూలో మళ్లీ నైట్ కర్ఫ్యూ