Delhi Election Results : ఆప్‌కు బిగ్ షాక్.. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి.. బీజేపీ పర్వేష్ వర్మ చేతిలో పరాజయం

Delhi Election Results : అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. తన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రత్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో పరాజయం పాలయ్యారు.

Delhi Election Results : ఆప్‌కు బిగ్ షాక్.. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి.. బీజేపీ పర్వేష్ వర్మ చేతిలో పరాజయం

Parvesh Verma defeats Arvind Kejriwal

Updated On : February 8, 2025 / 2:51 PM IST

Delhi Election Results : ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు. తన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ప్రత్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో పరాజయం పాలయ్యారు.

కేజ్రీవాల్‌ను వర్మ 3182 ఓట్ల తేడాతో ఓడించారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాల్గోసారి ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం వంటివే కేజ్రీవాల్ ఓటమికి ప్రధాన కారణాలు చెప్పవచ్చు.

Read Also : Delhi Results 2025 : కేజ్రీవాల్‌కి ముందే చెప్పా.. అయినా పట్టించుకోలేదు.. లిక్కర్ పాలసీపైనే ఫోకస్ పెట్టాడు.. అన్నా హజారే కామెంట్స్..!

ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం.. పర్వేశ్ వర్మ ప్రస్తుతం 1,800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా రెండు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ పర్వేశ్ వర్మపై 3వేల ఓట్లకు పైగా వెనుకబడి ఉన్నారు. 11 రౌండ్ల లెక్కింపు తర్వాత కేజ్రీవాల్ ఓట్ల సంఖ్య 20,190 కాగా, వర్మకు 22,034 ఓట్లు వచ్చాయి.

కొద్దిసేపు ఆధిక్యంలో నిలిచిన తర్వాత కేజ్రీవాల్ ఓటమి దిశగా సాగినట్టు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ తెలిపింది. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి కేజ్రీవాల్ ఓట్ల సంఖ్య 18,097 కాగా, వర్మకు 19,267 ఓట్లు వచ్చాయి. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను 45 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉందని ట్రెండ్స్ చూపించాయి.

1998 నుంచి ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేదు. మరోవైపు, గత 10 ఏళ్లుగా ఆప్ ఢిల్లీ రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయించింది. 2015, 2020 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచింది. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని ఆశించింది. కానీ, వరుసగా మూడోసారి ఓటమి పాలయ్యే దిశగా పయనిస్తోంది. ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 1.55 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్న ఢిల్లీలో 60.54 శాతం పోలింగ్ నమోదైంది.

పర్వేశ్ వర్మ ఎవరు? :
నవంబర్ 7, 1977న జన్మించిన పర్వేష్‌ సాహిబ్ సింగ్ వర్మ ప్రముఖ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు. ఆయన విద్యాభ్యాసం ఆర్‌కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్శిటీని కిరోరి మాల్ కాలేజీలో చేరారు. ఆయన ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని కూడా పొందారు. ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ బీజేపీ నేత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడిగా, పర్వేష్ దేశ రాజధానిలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబంలో భాగంగా నిలిచారు.

Read Also : KTR : మన ‘చంద్రుడు’ మబ్బుల్లోకి వెళ్లాడంతే.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. కేసీఆర్ సీఎం పక్కా : కేటీఆర్ కామెంట్స్!

ఆయన మామ ఆజాద్ సింగ్, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై ముండ్కా విధాన సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వర్మ స్వయంగా 2013లో తొలిసారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన మెహ్రౌలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఆ సమయంలో ఢిల్లీ విధానసభ స్పీకర్‌గా ఉన్న తన కాంగ్రెస్ ప్రత్యర్థి యోగానంద్ శాస్త్రిని ఓడించారు.