కేరళలో కొత్త వ్యాధి కలకలం..

  • Published By: sreehari ,Published On : December 11, 2020 / 09:10 PM IST
కేరళలో కొత్త వ్యాధి కలకలం..

Updated On : December 11, 2020 / 9:28 PM IST

New genus of malaria : కేరళలో కొత్త వ్యాధి కలకలం రేపింది. రాష్ట్రంలో ‘ప్లాస్మోడియం ఓవల్’ అనే కొత్త మలేరియా జాతి పరాన్న జీవి వ్యాధిగా ఆరోగ్య మంత్రి కె.కె.శైలజా తెలియజేశారు. సూడాన్ నుండి వచ్చిన ఓ సైనికుడిలో ఈ వ్యాధిని గుర్తించినట్టు తెలిపారు.

ప్రస్తుతం అతన్ని కన్నూర్ లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని ట్విట్టర్ వేదికగా శైలజా పేర్కొన్నారు. సకాలంలో సరైన చికిత్స అందించడంతో పాటు నివారణ చర్యలతో వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చునని ఆమె తెలిపారు.

చైనాలోని వుహాన్ యూనివర్శిటీలో చదువుతున్న ఒక విద్యార్థి, భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో తొలి కరోనావైరస్ కేసు నమోదైంది. భారత్ లో ఇదే తొలి కరోనా కేసు కూడా. 2018లో కూడా కోజికోడ్ జిల్లా నుండి నిఫా వైరస్ వ్యాధి కేరళలోనే వ్యాప్తి చెందింది.