New Ministers Take Charge: బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు
కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా తమ పదవీ బాధ్యతలు చేపడుతున్నారు.

Ministers (2)
New Ministers Take Charge కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా తమ పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. తమ కుటుంబీకులు, మంత్రుల మధ్య నూతన మంత్రులు తమ బాధ్యతలు స్వీకరించారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా జి. కిషన్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు. పర్యాటక శాఖ సహాయ మంత్రలు అజయ్ భట్, శ్రీపాద్ నాయక్ మరియు సాంత్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. అంతకుముందు కిషన్ రెడ్డి తన భార్యతో కలిసి పర్యాటక శాఖ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రం నుంచి తొలి కేంద్ర కేబినేట్ మంత్రి హోదా దక్కించుకున్న తొలి నేత కిషన్ రెడ్డి కావడం విశేషం. 2019లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత కేవలం 25 నెలల్లోనే ప్రధానమంత్రి మంత్రివర్గంలో కేబినేట్ మంత్రిగా కిషన్ రెడ్డికి పదోన్నతి లభించింది.
ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిగా మన్సుఖ్ మాండవ్య, రైల్వే,ఐటీ మంత్రిగా అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ప్రసార మంత్రిగా అనురాగ్ ఠాకూర్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రిగా కిషన్ రెడ్డి, రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్, న్యాయమంత్రిగా కిరణ్ రిజిజు, పెట్రోలియం మంత్రిగా హర్దీప్ సింగ్ పూరీ, పౌర విమాన మంత్రిగా సింధియా,కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, పోర్ట్స్,షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాలా, పర్యావరణ మరియు కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు దర్శన్ విక్రమ్, రావ్ సాహెబ్ దాదారావ్, మహేంద్ర భాయ్, జిత్రేంద్ర సింగ్, ధర్మంద్ర ప్రధాన్, శోభా కరంద్లాజే, రాజీవ్ చంద్రశేఖరన్,పశుపతి కుమార్ పరాస్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలందరూ గురువారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కానున్నారు. ఇక,కేబినెట్ భేటీ అనంతరం తొలిసారిగా ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షన జరిగే కేబినెట్ భేటీలో మంత్రులందరూ పాల్గొననున్నారు.