New scheme for tourism: టూరిస్ట్ వెహికల్స్ తిరగడానికి దేశమంతా ఒకటే పర్మిషన్

టూరిస్ట్ వెహికల్స్ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగేందుకు వీలుగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మినిస్ట్రీ నూతన పర్మిట్‌ విధానాన్ని ప్రకటించింది. పర్మిషన్లు ఇవ్వడం ఇక రాష్ట్రాల నుంచి..

New scheme for tourism: టూరిస్ట్ వెహికల్స్ తిరగడానికి దేశమంతా ఒకటే పర్మిషన్

The City Central Project (1)

Updated On : March 15, 2021 / 10:55 AM IST

New scheme for tourism: టూరిస్ట్ వెహికల్స్ దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగేందుకు వీలుగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మినిస్ట్రీ నూతన పర్మిట్‌ విధానాన్ని ప్రకటించింది. పర్మిషన్లు ఇవ్వడం ఇక రాష్ట్రాల నుంచి కేంద్రం చేతిలోకి వెళ్లిపోనుంది. ఏ రాష్ట్రానికి చెందిన పర్యాటక వాహన(టూరిస్టు వెహికల్‌)అయినా ఆలిండియా టూరిస్టు పర్మిట్‌ కావాలంటే.. https://parivahan.
gov.in/parivahan వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకున్న 30 రోజుల గ్యాప్‌లో పర్మిట్‌ శాన్‌క్షన్ చేస్తుంది.. లేదనేది స్పష్టం చేస్తామని కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఈ కొత్త పద్ధతి ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. కనీసం 3 నెలల నుంచి అత్యధికంగా మూడేళ్లకు పర్మిషన్లు ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో పర్యాటకులకు కొన్ని సమయాల్లోనే డిమాండ్‌ ఉంటుంది. అలాంటి ప్రాంతాల టూరిస్టు ఆపరేటర్లు ఆ వ్యవధి మేరకే పర్మిట్‌ తీసుకోవటం ద్వారా ఆర్థిక భారం పడకుండా ఉంటుందన్నది కేంద్రం ఆలోచన.

ప్రస్తుతం ఏ రాష్ట్రానికి వాహనం నడపాలని ఆపరేటర్‌ నిర్ణయించుకుంటారో అక్కడ పన్నులు చెల్లించి పర్మిషన్ తీసుకోవాలి. వన్ నేషన్.. వన్ పర్మిట్ ప్రోసెస్‌తో నూతన విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పర్మిట్‌ తీసుకున్న వాహనాలు ఏయే రాష్ట్రాల్లో పర్యటించాయో గుర్తించి రాష్ట్రాలకు కేంద్రమే వసూలైన పన్ను ఆదాయాన్ని బదలాయిస్తుంది.

వచ్చే నెల నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికే పర్మిట్లు తీసుకుంటే ఆ గడువు తీరేంత వరకు అవి చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకం రానున్న రోజుల్లో మరింత ఊపందుకుంటుందన్న అంచనాలతో ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.