Police Quarters Building : బెంగళూరులో కూలడానికి సిద్ధంగా మరో బిల్డింగ్..ఒరుగుతున్న పోలీస్ క్వార్టర్స్ బిల్డింగ్
కొద్దిరోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో వరుసగా భవనాలు ఒరిగి కూలిపోయితున్న విషయం తెలిసిందే. తాజాగా వీటి సరసన కొత్తగా నిర్మించిన పోలీస్ క్వార్టర్ బిల్డింగ్ చేరింది.

Building
Police Quarters Building కొద్దిరోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో వరుసగా భవనాలు ఒరిగి కూలిపోయితున్న విషయం తెలిసిందే. తాజాగా వీటి సరసన కొత్తగా నిర్మించిన పోలీస్ క్వార్టర్ బిల్డింగ్ చేరింది. మాగడి రోడ్డులోని ఏడంతస్తుల పోలీస్ క్వార్టర్స్ లోని బీ బ్లాక్ బిల్డింగ్ 1.5 అడుగుల మేర ఒరిగింది. దీంతో అందులో నివాసం ఉంటున్న 38 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. బీ బ్లాక్ ఖాళీ చేసిన 38 కుటుంబాలను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ క్వార్టర్స్‌కు పంపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇక, ‘సి’ బ్లాక్ బిల్డింగ్ లోని కుటుంబాలకు కూడా ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఒరుగుతున్న బీ బ్లాక్, సీ బ్లాక్ బిల్డింగ్‌పై పడుతుండటంతో దానికి కూడా ప్రమాదం ముంచుకొస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా,మాగడి రోడ్డులోని పోలీస్ క్వార్టర్స్ బిల్డింగ్ నిర్మాణం మూడేండ్ల కిందట పూర్తి కాగా, గత ఏడాదే పోలీస్ సిబ్బంది కుటుంబాలకు క్వార్టర్స్‌ను కేటాయించారు.
కాగా, నాణ్యతలేని నిర్మాణం వల్లనే కట్టిన మూడేండ్లకే పోలీస్ క్వార్టర్స్ భవనాలు కుంగిపోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బీబీఎంపీ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ..ఈ భవనం జపనీస్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించబడింది. సిమెంట్ బ్లాకులతో నిర్మాణం జరిగింది. బ్లాక్‌ల మధ్య బీమ్ ఇన్‌స్టాల్ చేయబడలేదు మరియు అవి బాగా సపోర్ట్ చేయబడవు. ఈ భవనం మూడేళ్ల క్రితం నిర్మించబడింది మరియు ఆరున్నర అంగుళాల పగుళ్లు ఉన్నాయని తెలిపారు.
అయితే బెంగళూరులో పాత మరియు బలహీనమైన భవనాలు కూలిపోయిన సంఘటనలు వరుసగా నమోదవడంతో బృహత్ బెంగళూరు మహానగర పాలికే(BBMP) ఓ సర్వే చేపట్టింది. బెంగుళూరులో నిర్మాణాత్మకంగా బలహీనంగా ఉన్న మరియు ఎప్పుడైనా కూలిపోయే 404 భవనాలను కూల్చివేయడానికి బీబీఎంపీ సిద్ధమవుతోంది.
ALSO READ కేరళలో వర్ష బీభత్సం..ఐదుగురు మృతి,12మంది గల్లంతు