కరోనాతో కర్ణాటక బీజేపీ ఎంపీ కన్నుమూత

కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ(55)కరోనాతో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గస్తీ…సెప్టెంబర్ 2న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు.
శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ అయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అశోక్ గస్తీ మృతిపట్ల పలువురు ప్రముఖులు, కర్ణాటక బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. శోక్ 18 ఏళ్ల వయసులోనే బీజేపీ యువ మోర్చాలో చేరారు. 2012లో బీసీ కమిషన్ చైర్మన్‌గా సేవలందించారు.ఇటీవలే అశోక్ గస్తీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఏడాది జులై 22న రాజ్యసభ ఎంపీగా అశోక్ ప్రమాణస్వీకారం చేశారు.
అశోక్.. 18 సంవత్సరాల వయసులోనే బీజేపీలో చేరి, కర్ణాటక బీజేపీకి చెందిన యువ మోర్చాకు నాయకత్వం వహించారు. ఏబివిపి కార్యకర్తగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సభ్యుడుగా కూడా పనిచేశారు. 2012లో బీసీ కమిషన్ చైర్మన్ గా కూడా అశోక్ గస్తీ సేవలందించారు.