Darbhanga Blast : లష్కరే ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ ని హైదరాబాద్ తీసుకొచ్చిన అధికారులు

Darbhanga Blast : లష్కరే ఉగ్రవాదులు మాలిక్ బ్రదర్స్ ని హైదరాబాద్ తీసుకొచ్చిన అధికారులు

Darbhanga Blast

Updated On : July 6, 2021 / 12:18 AM IST

Darbhanga Blast : దర్భంగా పార్సిల్ బాంబు పేలుడు కేసులో కీలక నిందితులుగా ఉన్న మాలిక్ బ్రదర్స్ (నాసిర్ ఖాన్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్)ను ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌ మాదాపూర్ ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. భారీ భద్రత మధ్య వారిని ఇక్కడికి తీసుకొచ్చారు. కాగా జూన్ 17 బీహార్ లోని దర్బంగా రైల్వేస్ స్టేషన్ లో పార్సిల్ బాంబు పేలింది.

దీంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వాత బిహార్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కి కేసును అప్పగించారు. కేసు తీవ్రత, వేర్వేరు రాష్ట్రాలతో ముడిపడ్డ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో లోతుగా విచారణ జరిపి, నలుగురిని అరెస్ట్ చేసింది.

వారిలో ఇద్దరు మాలిక్ సోదరు. మరో ఇద్దరు మహ్మద్ సలీం అహ్మద్ అలియాస్ హాజీ సలీం, కాఫిల్ అలియాస్ కఫీల్. వీరు గతంలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఇక ఈ నేపథ్యంలోనే సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు మాలిక్ సోదరులను హైదరాబాద్ తీసుకొచ్చారు ఎన్ఐఏ అధికారులు.