Bank Holidays : బ్యాంకులకు తొమ్మిది రోజులు సెలవులు

దేశంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల‌కు అక్టోబర్ 12 నుంచి తొమ్మిది రోజులపాటు సెల‌వులు ఉన్నాయి. అక్టోబ‌ర్‌లో దుర్గాపూజ‌, న‌వ‌రాత్రి, ద‌స‌రా త‌దిత‌ర విభిన్న ప‌ర్వ‌దినాలు ఉన్నాయి.

Bank Holidays : బ్యాంకులకు తొమ్మిది రోజులు సెలవులు

Bank

Nine Holidays for banks : దేశంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల‌కు బుధ‌వారం అక్టోబర్ 12 నుంచి తొమ్మిది రోజులపాటు సెల‌వులు ఉన్నాయి. అక్టోబ‌ర్‌లో దేశ‌ వ్యాప్తంగా దుర్గాపూజ‌, న‌వ‌రాత్రి, ద‌స‌రా త‌దిత‌ర విభిన్న ప‌ర్వ‌దినాలు ఉన్నాయి. ఆర్ బీఐ షెడ్యూల్ ప్ర‌కారం అక్టోబ‌ర్‌లో ఎక్కువ రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు ఉన్నాయి.

అయితే రాష్ట్రాల వారీగా సెల‌వుల్లో తేడాలు ఉండనున్నాయి. ఈ నెల‌లో మొత్తం 21 రోజులు సెలవు దినాలు ఉండగా, ఈ నెల 12 నుంచి 31 వరకు తొమ్మిది రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి.

Ola : అక్టోబర్ నెలలో ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్.. రుణాలు అందించేందుకు బ్యాంకులు రెడీ!

అక్టోబ‌ర్ 12.. దుర్గా పూజ (మ‌హా స‌ప్త‌మి)/అగ‌ర్త‌ల‌, కోల్‌క‌తా
అక్టోబ‌ర్ 13.. దుర్గాపూజ (మ‌హా అష్ట‌మి)/అగ‌ర్త‌ల‌, భువ‌నేశ్వ‌ర్‌, గ్యాంగ్‌ట‌క్‌, గువాహ‌టి, ఇంఫాల్‌, కోల్‌క‌తా, పాట్నా, రాంచీ.
అక్టోబ‌ర్ 14.. దుర్గా పూజ/ద‌స‌రా(మ‌హాన‌వమి/ఆయుధ పూజ‌)/అగ‌ర్త‌ల‌, బెంగ‌ళూరు, చెన్నై, గ్యాంగ్‌ట‌క్‌, గువాహ‌టి, కాన్పూర్‌, కోచి, కోల్‌క‌తా, ల‌క్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌, శ్రీ‌న‌గ‌ర్‌, తిరువ‌నంత‌పురం.
అక్టోబ‌ర్ 15.. దుర్గాపూజ/ద‌స‌రా (విజ‌య ద‌శ‌మి)/ఇంఫాల్‌, సిమ్లా మిన‌హాల్లో మిన‌హా అన్ని చోట్ల సెల‌వు.
అక్టోబ‌ర్ 16.. దుర్గాపూజ (ద‌సైన్‌)/గ్యాంగ్‌ట‌క్‌
అక్టోబ‌ర్ 17.. ఆదివారం
అక్టోబ‌ర్ 18.. కాటి బిహు(గువాహ‌టి)
అక్టోబ‌ర్ 19.. ఈద్ ఈ మిలాద్‌
అక్టోబ‌ర్ 20 .. వాల్మికిజ‌యంతి
అక్టోబ‌ర్ 22 .. ఈద్ ఈ మిలాద్ ఉల్ న‌బీ (జ‌మ్ము, శ్రీ‌న‌గ‌ర్‌)
అక్టోబ‌ర్ 23.. నాలుగో శ‌నివారం
అక్టోబ‌ర్ 24.. ఆదివారం
అక్టోబ‌ర్ 26.. అసెస్స‌న్ డే (జ‌మ్ము, శ్రీ‌న‌గ‌ర్‌)
అక్టోబ‌ర్ 31.. ఆదివారం