ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకా గాంధీనా? రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే?

"నేను రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి" అని వాద్రా చెప్పారు.

ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకా గాంధీనా? రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే?

Robert Vadra

Updated On : December 23, 2025 / 6:22 PM IST

Priyanka Gandhi Vadra: ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రాను తమ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థిగా నిలపాలని ఎంపీ ఇమ్రాన్ మసూద్ అన్నారు. దీనిపై ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు.

“ఈ విషయంలో ప్రియాంకా గాంధీ ముందుకు రావాలన్న డిమాండ్లు అన్ని వైపులా వినిపిస్తున్నాయి. నేను రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ప్రజలను ప్రభావితం చేస్తున్న అసలైన సమస్యలపైనే మన దృష్టి ఉండాలి” అని రాబర్ట్ వాద్రా అన్నారు.

తాజాగా, కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీ వాద్రాను ప్రధానమంత్రిగా చేస్తే ఆమె తన నానమ్మ, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీలా శక్తిమంతంగా అన్ని విషయాలపై స్పందిస్తారని చెప్పారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై పెరుగుతున్న హింసపై ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Hyderabad: డ్రంకెన్ డ్రైవింగ్‌ చేస్తే ఇక అంతే.. ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌

“ప్రియాంకా గాంధీని ప్రధానమంత్రిగా చేసి చూడండి. ఇందిరా గాంధీలా ఎలా ప్రతీకారం తీసుకుంటారో చూస్తారు. ఇప్పటికీ మానని గాయాలు మిగిలేలా పాకిస్థాన్‌ను దెబ్బతీసిన ఇందిరా గాంధీ మనవరాలు ఆమె. ఆమెను ప్రధానమంత్రిగా చేసి చూడండి. అలా చేయడానికి మీకు ధైర్యం ఉండదు” అని ఇమ్రాన్ మసూద్ అన్నారు.

ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్య తర్వాత అక్కడ హిందూ, క్రైస్తవ, బౌద్ధులపై పెరుగుతున్న హింసను కేంద్ర ప్రభుత్వం గమనించాలని ప్రియాంకా గాంధీ వాద్రా కోరారు.