ఉరి వాయిదాపై గంభీర్ ట్వీట్ : ఆ రాక్షసులు బ్రతికిన ప్రతీక్షణం న్యాయస్థానానికి మచ్చ..వెంటనే ఉరి తీయండి

నిర్భయ నిందితుల ఉరిశిక్ష వాయిదా పడటంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తీవ్ర అసహనం..అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన గంభీర్.. ఈ రాక్షసులు జీవించే ప్రతిరోజూ.. న్యాయవ్యవస్థకు మాయని మచ్చలాంటిదని పేర్కొన్నారు. ‘‘దారుణం జరిగి ఏడేళ్లయ్యింది.. ఒక తల్లి నిరీక్షణ ఇంకెన్నాళ్లు? వెంటనే ఉరితీయండి’’ అంటూ ట్వీట్ చేశారు.
हाथ उसके भी हुए होंगे..यकीनन ज़ख़्मी..
काँटे जिसने “इंसाफ़” की राहों में बिछाए होंगे !#nirbhayaconvicts https://t.co/CtNfnF6rQU
— Gaurav Arora (@gauravbir786) January 31, 2020
నిర్భయ హత్యాచార కేసు దోషుల ఉరితీత వాయిదా పడిన విషయం తెలిసిందే. డెత్ వారెంటు ప్రకారం శనివారం ఉదయం (ఫిబ్రవరి 1) ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉరితీయాలి. దీని కోసం తలారి పవన్ జల్లాద్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఉరి తీయటానికి ట్రయల్స్ కూడా నిర్వహించాడు. ఉరి తీసే విషయంలో ఎటువంటి పొరపాట్లు జరకుండా ముందే ఇసుక బస్తాలతో రియాల్ససస్ కూడా చేశాడు.
అయితే దోషుల్లో ముగ్గురు- అక్షయ్‌కుమార్, పవన్‌గుప్తా, వినయ్‌శర్మ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఉరికి వ్యతిరేకంగా తమకున్న న్యాయపరమైన మార్గాలేవీ ఇంకా పూర్తికాలేదని..ఫిబ్రవరి 1న డెత్ వారెంట్ అమలు జరపడానికి వీల్లేదని వాదించారు. వీరి తరఫున వాదించిన ఏపీ సింగ్ అనే అడ్వొకేట్.. వాళ్లు బ్రతికే చివరిక్షణం దాకా దోషులకు అవకాశాలుంటాయని, వారు క్యూరేటివ్ పిటిషన్లు వేశారనీ, ఇంకా రాష్ట్రపతి క్షమాభిక్ష ఓ అవకాశంగా వారికి ఉందనీ వాదించారు.
తమ డెత్‌వారెంట్ అమలును నిరవధికంగా వాయిదా వెయ్యాలని కోరారు. నలుగురు దోషుల్లో ముఖేశ్ కుమార్ అనే ఒక్కడి అవకాశాలు మాత్రమే పూర్తయి ఉరికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నియమావళి ప్రకారం.. ఒక కేసులో ఒకరి కంటే ఎక్కువ మంది దోషులు ఉన్నపుడు అందరినీ ఒకేసారి ఉరితీయాలి. కాగా నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన విషయం తెలిసిందే.