Nirmala Sitharaman : ఇన్ఫోసిస్ కి నిర్మలా సీతారామన్ ట్వీట్
పన్నుదారుల సౌలభ్యం కోసం కొత్త తరహా ఫీచర్లతో ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Nirmala Sitharaman Asks Infosys To Fix Tech Glitches On New Income Tax Portal
Nirmala Sitharaman పన్నుదారుల సౌలభ్యం కోసం కొత్త తరహా ఫీచర్లతో ఆదాయపన్ను శాఖ సోమవారం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ లో అనేక టెక్నికల్ సమస్యలు వస్తున్నట్లు పెద్ద ఎత్తున కంప్లెయింట్స్ వస్తున్న నేపథ్యంలో ఆ వెబ్‌సైట్‌ను సరిచేయాలని, దాన్ని డెవలప్ చేసిన ఇన్ఫోసిస్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ ద్వారా కోరారు.
ఈ-ఫైలింగ్ పోర్లట్ 2.0ను గత రాత్రి 8.45 నిమిషాలకు ప్రారంభించారని, తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్యాక్స్ పేయర్స్ నుంచి ఫిర్యాదులు అందాయని, ఆ టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలని ఆర్ధిక మంత్రి కోరారు. పన్నుదారులను ఇబ్బందిపెట్టవద్దని, వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరించాలని ఇన్‌ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేఖనికి తన ట్వీట్‌ను ఆమె ట్యాగ్ చేశారు. పన్నుదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మల సూచించారు.