Jayalalithaa Saree Incident: ‘ఇండియా’ను టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారంటూ అటాక్

మణిపూర్, ఢిల్లీ, రాజస్థాన్ ఇలా ఎక్కడైనా స్త్రీల బాధలను సీరియస్‌గా తీసుకోవాలనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. అలాంటి వాటిలో రాజకీయాలు ఉండకూడదు. కానీ ఈ సభలో ద్రౌపది గురించి చర్చ జరిగింది. ఈ సభలో 25 సంవత్సరాలుగా ఉన్నాను.

Jayalalithaa Saree Incident: ‘ఇండియా’ను టార్గెట్ చేసిన నిర్మలా సీతారామన్.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారంటూ అటాక్

Updated On : August 10, 2023 / 3:47 PM IST

Nirmala Sitharaman: బుధవారం పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మణిపూర్‭లో ఇద్దరు మహిళల్ని వివస్త్రల్ని చేసి ఊరేగించిన ఘటనను గుర్తు చేస్తూ భారతమాతను అవమానించారంటూ మండిపడ్డారు. ఇక గురువారం కనిమొళి మాట్లాడుతూ ద్రౌపదికి జరిగిన అవమానం గురించి మాట్లాడారు. అయితే ఇది గడిచిన ఒకరోజు అనంతరం విపక్షాలను గట్టిగానే టార్గెట్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 1989లో అసెంబ్లీలో జయలలితకు జరిగిన అవామానాన్ని ప్రస్తావిస్తూ ఆమె విమర్శలు గుప్పించారు.

Delhi : తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చెల్లెలిపై కాల్పులు జరిపిన మహిళ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చీరను అసెంబ్లీలో లాగి ఆమెను తీవ్రంగా అవమానించారని నిర్మల గుర్తు చేశారు. దీనికి డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. ‘‘మహాభారతాన్ని చదివిన వారికి ఒక విషయం అర్థమవుతుంది. ద్రౌపది విషయంలో చివరికి నేరస్తులకే శిక్ష పడింది. అదే సమయంలో మౌనంగా ఉన్నవారికి కూడా శిక్ష పడింది. హత్రాస్, కథువా, ఉన్నావ్, బిల్కిస్ బానో, మల్లయోధుల నిరసనలపై వారు (కేంద్రం) మౌనంగా ఉన్నారు. వారు కూడా శిక్షించబడతారు’’ అని కనిమొళి అన్నారు.

Union Govt : కేంద్రం మరో వివాదాస్పద బిల్లు.. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నియామకంలో సీజేఐ ప్రమేయాన్ని తొలగించేలా బిల్లు రూపకల్పన

అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా మాట్లాడుతూ.. ‘‘మణిపూర్, ఢిల్లీ, రాజస్థాన్ ఇలా ఎక్కడైనా స్త్రీల బాధలను సీరియస్‌గా తీసుకోవాలనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. అలాంటి వాటిలో రాజకీయాలు ఉండకూడదు. కానీ ఈ సభలో ద్రౌపది గురించి చర్చ జరిగింది. ఈ సభలో 25 సంవత్సరాలుగా ఉన్నాను. ఇన్ని రోజులకు అలాంటి అంశం వచ్చినందుకు అభినందించాలనుకుంటున్నాను. అయితే అదే సమయంలో 1989 మార్చిలో తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటనను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను’’ అని అన్నారు.

Chandrayaan-3: అంతరిక్షం నుంచి భూమి ఇలా ఉంటుంది.. ఫొటోలు విడుదల చేసిన చంద్రయాన్-3

ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘జయలలిత అప్పటికి సీఎం కాలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీలో ఆమె చీర లాగేసారు. ఆ పవిత్ర సభలో ఆమె చీర లాగినప్పుడు అధికార డీఎంకే సభ్యులు కూర్చున్నారు. ఆ విద్రోహ చర్యకు వారు సమర్ధులుగానే ఉన్నారు. ఆమెను చూసి నవ్వారు. జయలలితను డీఎంకే మరచిపోయిందా? మీరు ఆమె చీర లాగారు, మీరు (కనిమొళికి సమాధానం ఇస్తూ) ఆమెను అవమానించారు. ఆ రోజు జయలలిత సీఎం అయ్యే వరకు సభకు రానని ప్రమాణం చేశారు. రెండేళ్ల తర్వాత తమిళనాడు సీఎంగా తిరిగి వచ్చారు. సభలో మహిళ చీర లాగిన వారు ఆమెను చూసి నవ్వుకున్నారు. వారు ఈరోజు ద్రౌపది గురించి మాట్లాడుతున్నారు” అని అన్నారు.