Union Govt : కేంద్రం మరో వివాదాస్పద బిల్లు.. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నియామకంలో సీజేఐ ప్రమేయాన్ని తొలగించేలా బిల్లు రూపకల్పన

ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో సీజేఐకి ప్రమేయం లేకుండా ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే సీఈసీ నియామక కమిటీల్లో సీజేఐకి ఎలాంటి అధికారం ఉండదు.

Union Govt : కేంద్రం మరో వివాదాస్పద బిల్లు.. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నియామకంలో సీజేఐ ప్రమేయాన్ని తొలగించేలా బిల్లు రూపకల్పన

Union Government

Union Govt Controversial New Bill : ఢిల్లీ ప్రతేక అధికారాల బిల్లును ఆమోదింప చేసుకున్న కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద బిల్లును తెరపైకి తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియమాక ప్యానెల్ నుంచి సీజేఐ నుంచి తప్పించేలా బిల్లును తెచ్చింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమేయాన్ని తొలగించేలా బిల్లును రూపొందించింది.

చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ నియామకంలో ప్రధానమంత్రి సభ్యుడిగా ఉన్న కమిటీ, లోక్ సభ ప్రతిపక్షనేత, సీజేఐ కలిసి సీఈసీని నియమించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(సీఈవో) నియామకాన్ని ప్రధానమంత్రి సభ్యుడిగా ఉన్న కమిటీ, లోక్ సభ ప్రతిపక్షనేత, సీజేఐకి కట్టబెడుతూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా కేంద్రం ఈ బిల్లును తెచ్చింది.

Chandrayaan-3: అంతరిక్షం నుంచి భూమి ఇలా ఉంటుంది.. ఫొటోలు విడుదల చేసిన చంద్రయాన్-3

ఎన్నికల ప్రధాన అధికారి నియామకంలో సీజేఐకి ప్రమేయం లేకుండా ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు చట్టం రూపం దాల్చితే సీఈసీ నియామక కమిటీల్లో సీజేఐకి ఎలాంటి అధికారం ఉండదు.
మార్చిలో సీజేఐ ఈ ఆదేశాలు ఇచ్చారు. కోలీజియం వ్యవస్థపై ఇప్పటికే కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య విబేధాలు ఉన్నాయి.

ప్రధాన ఎన్నికల అధికారి నియామకంలోనూ సీజేఐ జోక్యం ఉండేలా తీర్పు ఇవ్వడం పట్ల కేంద్రం పెద్దలు అసంతృప్తిగా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఐదు నెలల తర్వాత కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుతో ఇది నిజమేనని తేలింది.