Vice President Dhankhar : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కరణ..!

Vice President Dhankhar : రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డిసెంబర్ 10 తేదీన ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Vice President Dhankhar : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కరణ..!

Vice President Jagdeep Dhankhar

Updated On : December 19, 2024 / 4:28 PM IST

Vice President Dhankhar : ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్‌ను తొలగించాలని కోరుతూ విపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్‌ సింగ్ తోసిపుచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించినట్లుగా సభలో రాజ్యసభ సెక్రెటరీ జనరల్ ప్రకటన చేశారు.

ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన నోటీసు అనుచిత చర్య అని, తీవ్ర లోపభూయిష్టంగా ఉందని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు తొందరపాటుతో చేసినట్టుగా ఉందని ఆర్‌ఎస్ డిప్యూటీ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు.

రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డిసెంబర్ 10 తేదీన ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ ‘పక్షపాత’ పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

కనీసం 60 మంది ప్రతిపక్ష సభ్యులు ధన్కడ్ పదవి నుంచి తొలగించాలని నోటీసుపై సంతకం చేశారు. ఈ అభిశంసన నోటీసులో వాస్తవ ప్రాతిపదికన లేదని, చట్టబద్ధమైన ఆందోళన కన్నా పబ్లీసిటీ పొందడమే లక్ష్యంగా కనిపించిందని హరివంశ్ నారాయణ్‌ సింగ్ పేర్కొన్నారు.

పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా :
పార్లమెంట్ ఆవరణలో తోపులాట ఘటనపై అధికార విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. రాహుల్ గాంధీపై రాజ్యసభ చైర్మన్‌కి నాగాలాండ్ బీజేపీ మహిళా ఎంపీ ఫంగనాన్ కొన్యాక్ ఫిర్యాదు చేశారు.

రాహుల్ గాంధీ పార్లమెంట్ ఆవరణలో తనను తోసేసారని, అసభ్యంగా ప్రవర్తించారని, తనకు రక్షణ కల్పించాలని రాజ్యసభ చైర్మన్‌ను ఆమె కోరారు. బీజేపీ ఎంపీ కొన్యాక్ ఫిర్యాదును పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

Read Also : Priyanka Gandhi Vadra : అమిత్ షాను కాపాడేందుకు రాహుల్‌ గాంధీపై ఆరోపణలు.. బీజేపీ ఎంపీలకు ప్రియాంక గాంధీ వాద్రా ఛాలెంజ్..!