రెండు వారాలుగా 25 జిల్లాల్లో కరోనా కేసుల్లేవ్..

  • Published By: chvmurthy ,Published On : April 13, 2020 / 02:07 PM IST
రెండు వారాలుగా 25 జిల్లాల్లో కరోనా కేసుల్లేవ్..

Updated On : April 13, 2020 / 2:07 PM IST

కరోనా కేసులు పెరుగుతున్నాయ్ అన్న సమాచారం మధ్య ఇది తీపి కబురే. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం గట్టిగా ఆశను పెంచే కబురే చెప్పింది.  దేశంలోని 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో రెండు వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కాగా దేశవ్యాప్తంగా, 24గంటల్లో కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. 35 మంది చనిపోయారు.

మొత్తం మీద 9,152 కేసులు నమోదైతే, మరణాల సంఖ్య 308కి చేరింది. ఇప్పటి వరకు రెండు లక్షల ఆరువేల మందికి టెస్ట్ లు చేశారు. మరో 14 ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడా టెస్ట్‌లు మొదలవుతాయి.

ఇంతకీ ప్రధాని ఏం చెప్పబోతున్నారు? లాక్‌డౌన్ ఇలాంటి జిల్లాల్లో ఎత్తివేసి, కేసులున్న చోట్ల గట్టిగా నిర్భందాన్ని అమలుచేస్తారా? నాన్చి, నాన్చి మోడీ అసలు విషయం చెప్పబోతున్నారు. ఈసారి కూడా, రాష్ట్రాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొనే అవకాశాన్ని మోడీ ఇవ్వబోవడం లేదు. కనీసం సోమవారం నాడైనా, మనసులోని మాటను చెబితే, రాష్ట్రాలకు కొంత వెసులుబాటుండేది. మోడీ మాత్రం ఆకస్మిక, అసాధారణ నిర్ణయాలను చెప్పడానికే నిర్ణయించుకున్నట్లున్నారు.

ఇప్పటికే, తెలంగాణతో సహా మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, పశ్చిమబెంగాల్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు లాక్‌డౌన్ ను పొడిగిస్తామని ప్రకటించేశాయి. ఆంధ్రా సీఎం మాత్రం, వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. జోన్ల వారిగా లాక్‌డౌన్‌లో సడలింపు ఉండాలన్న తన వాదనకు మోడీ దన్ను దక్కుతుందని ఆయన ఆశ. మోడీ కూడా అదే మాటనే చెప్పొచ్చు.

Also Read | హైదరాబాద్ మీద కేసీఆర్ స్పెషల్ ఫోకస్…. కరోనా కట్టడికి కంటైన్మెంట్ జోన్ల వ్యూహం