Bhupesh Baghel : సీఎం తండ్రిపై ఎఫ్ఐఆర్.. చట్టం ముందు అందరూ సమానమే అని సీఎం సంచలన వ్యాఖ్యలు

ఏకంగా సీఎం భూపేష్ బాఘేల్ తండ్రి నందకుమార్ బాఘేల్ పై కేసు నమోదైంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డీడీ నగర్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నందకుమ

Bhupesh Baghel : సీఎం తండ్రిపై ఎఫ్ఐఆర్.. చట్టం ముందు అందరూ సమానమే అని సీఎం సంచలన వ్యాఖ్యలు

Bhupesh Baghel

Updated On : September 5, 2021 / 11:01 PM IST

Bhupesh Baghel : చత్తీస్ గఢ్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా సీఎం భూపేష్ బాఘేల్ తండ్రి నందకుమార్ బాఘేల్ పై కేసు నమోదైంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డీడీ నగర్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నందకుమార్ ఇటీవల బ్రాహ్మణులను బహిష్కరించాలంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వ బ్రాహ్మణ సమాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సెక్షన్ 153-ఏ, 505 (1) (బి) కింద కేసు నమోదు చేశారు.

Whats App Hacking : తల్లి వాట్సప్ హ్యాక్ చేసి, ఆమె ప్రియుడ్నిబ్లాక్ మెయిల్ చేసి…

ఈ వ్యవహారంపై సీఎం భూపేష్ బాఘేల్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. “చట్టానికి ఎవరూ అతీతులు కారు. 86 ఏళ్ల మా నాన్న కూడా అందుకు మినహాయింపు కాదు. చత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రతి ఒక్క మతాన్ని, వర్గాన్ని, సామాజిక వర్గం అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తుంది. అన్ని వర్గాలను, అన్ని సమాజాలను గౌరవిస్తుంది. ప్రతి ఒక్కరి మనోభావాలకు విలువనిస్తుంది. ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మా నాన్న చేసిన వ్యాఖ్యలు మత సామరస్యానికి భంగం కలిగించాయని భావిస్తున్నాం. ఆయన వ్యాఖ్యల పట్ల నేను కూడా బాధపడుతున్నా. ప్రతిఒక్కరి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని సీఎం అన్నారు.

”మా రాజకీయ అభిప్రాయాలు, నమ్మకాలు కచ్చితంగా భిన్నంగా ఉంటాయి.. సిద్ధాంతపరంగా ఆయనతో నేను విబేధించే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.. ఓ కుమారుడిగా మా తండ్రిని గౌరవిస్తాను.. కానీ, ఓ ముఖ్యమంత్రిగా ప్రజాభద్రతకు భంగం కలిగించేలా ఆయన చేసిన తప్పును క్షమించను’ అని సీఎం భూపేష్ బఘేల్ అన్నారు.

Costly Cottage : నీరు లేదు, కరెంటూ లేదు.. అయినా ఈ కాటేజీ ధర రూ.5 కోట్లు, ఎందుకంత రేటు అంటే..

‘‘బ్రాహ్మణులను మీ గ్రామాల్లోకి రానివ్వద్దని నేను భారతదేశంలోని గ్రామస్తులందరినీ కోరుతున్నాను. వారిని బహిష్కరించడానికి ఇతర సామాజిక వర్గాల్లో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతాను. వారిని వోల్గా నది ఒడ్డుకు తిరిగి పంపాలి’’ అని నందకుమార్ బాఘేల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం తండ్రి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. నంద్‌కుమార్ వ్యాఖ్యలపై యూపీ సహా పలు ప్రాంతాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ దుమ్మెత్తిపోస్తున్నారు.