No Driving Test : డ్రైవింగ్ లైసెన్స్‌కు ఇకపై టెస్ట్ అక్కర్లేదు..!
డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే.. ఇకపై టెస్ట్ అవసరం లేదు. కొత్త రూల్స్ ప్రకారం.. ఏదైనా డ్రైవింగ్ సెంటర్లలో ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. హైక్వాలిటీ డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవర్‌గా ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

No Test Required At Rto To Get Driving Licence
No Driving Test : డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే.. ఇకపై టెస్ట్ అవసరం లేదు. కొత్త రూల్స్ ప్రకారం.. ఏదైనా డ్రైవింగ్ సెంటర్లలో ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. హైక్వాలిటీ డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవర్‌గా ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే.. డ్రైవింగ్ లెసెన్స్ జారీ కోసం డ్రైవింగ్ టెస్టు నుంచి మినహాయింపు లభిస్తుంది. తద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందే సమయంలో ప్రత్యేకించి డ్రైవింగ్ టెస్టింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఇదివరకే డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు అక్రిడిటేషన్ కోసం రోడ్డు రవాణా హైవేల మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు ధృవీకరిస్తే.. టెస్టింగ్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. ట్రైనింగ్ సెంటర్లకు పూర్తి స్వేచ్చను ఇవ్వరు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గత డిసెంబర్‌లోనే ముసాయిదా రూపొందించింది. ఈ డ్రైవింగ్ కోర్సు లైట్ మోటార్ వెహికల్ కోసం అందించనున్నారు. కోర్సు వ్యవధి 29 గంటలు అంటే.. గరిష్టంగా నాలుగు వారాలు పాటు ఉంటుంది. ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టీసు కూడా ఉంటుంది.
ఇక మీడియం, హెవీ మోటార్ వెహికల్స డ్రైవింగ్ లైసెన్స్ కోర్సు వ్యవధి 38 గంటలు.. అంటే ఆరు వారాల పాటు ఉంటుంది. ఇందులో రెండు సిగ్మెంట్లు ఉంటాయి.. ఒకటి థియరీ, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో కొన్ని బేసిక్స్ కూడా నేర్పిస్తారు. అలాగే రోడ్లపై ఎలా వాహనాన్ని నడపాలనేది కూడా ట్రైనింగ్ ఇస్తారు. అంతేకాదు.. ఇండస్ట్రీలో డ్రైవింగ్ కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా అందించనున్నాయి.
తక్కువ సమయంలో డ్రైవింగ్ లో నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేలా కోర్సు అందిస్తారు. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల నుంచి పొందే అక్రిడేషన్ గడువు ఐదేళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ శిక్షణ ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలనే లక్ష్యంతో ఈ ముసాయిదాను ముందుకు తెచ్చింది.