Noida airport : నోయిడా విమానాశ్రయం రన్‌వే ఈ ఏడాదిలోగా సిద్ధం: సీఎం యోగి ఆదిత్యనాథ్

ఈ ఏడాది చివరి నాటికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి రన్‌వే సిద్ధమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. నోయిడా విమానాశ్రయం ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయమని, ఈ ప్రాజెక్టు బీజేపీ సర్కారుకు ప్రతిష్ఠాత్మకమని సీఎం యోగి పేర్కొన్నారు....

Noida airport : నోయిడా విమానాశ్రయం రన్‌వే ఈ ఏడాదిలోగా సిద్ధం: సీఎం యోగి ఆదిత్యనాథ్

Noida airport

Updated On : August 11, 2023 / 5:44 AM IST

Noida airport : ఈ ఏడాది చివరి నాటికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి రన్‌వే సిద్ధమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. నోయిడా విమానాశ్రయం ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయమని, ఈ ప్రాజెక్టు బీజేపీ సర్కారుకు ప్రతిష్ఠాత్మకమని సీఎం యోగి పేర్కొన్నారు. లక్నో నుంచి వరణాసికి విమాన సర్వీసును ప్రారంభించిన సందర్భంగా యోగి మాట్లాడారు.

Prime Minister Narendra Modi : మణిపుర్‌పై మోదీకి అమెరికా గాయని మేరి మిల్‌బెన్ మద్ధతు

ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నాటికి అయోధ్య ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది చివరి నాటికి జేవార్ ఎయిర్‌పోర్టు తొలి రన్‌వే కూడా సిద్ధమవుతుందని సీఎం చెప్పారు. ఈ విమానాశ్రయం వల్ల గ్రేటర్ నోయిడా ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాకుండా మొత్తం ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

Nuclear Weapons : ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది…యూఎన్ సంచలన నివేదిక

2021వ సంవత్సరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. 1,334 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది.