వార్నీ.. నోయిడాకు చెందిన వ్యక్తి ఒక్క రాత్రికే అంబానీ కంటే ధనవంతుడయ్యాడు.. అదెలా సాధ్యమైందంటే.. ఇక్కడే పెద్ద ట్విస్ట్..

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన 20ఏళ్ల వ్యక్తి తన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తం నగదు జమ కావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.

వార్నీ.. నోయిడాకు చెందిన వ్యక్తి ఒక్క రాత్రికే అంబానీ కంటే ధనవంతుడయ్యాడు.. అదెలా సాధ్యమైందంటే.. ఇక్కడే పెద్ద ట్విస్ట్..

Updated On : August 5, 2025 / 3:07 PM IST

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన 20ఏళ్ల వ్యక్తి తన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తం నగదు జమ కావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మొత్తం అందులో 37అంకెలు ఉన్నాయి. ఈ విషయాన్ని సచిన్ గుప్తా అనే జర్నలిస్ట్ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ ప్రకారం.. 20ఏళ్ల దీపక్ ఈ మొత్తాన్ని పొందాడని, అయితే, ఆ మొత్తం దాదాపు 1 బిలియన్ 13లక్షల56వేల కోట్ల రూపాయలు అని చెప్పాడు. ఆ ట్వీట్‌లో ఇలా రాశాడు.. ‘‘నేను గణితంలో కొంచెం వీక్. ఆ మొత్తం ఎంతో గుర్తించి చెప్పొచ్చు. ప్రస్తుతం ఆదాయపు పన్నుశాఖ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. బ్యాంకు ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారని’’ అని పేర్కొన్నాడు.

ఓ నివేదిక ప్రకారం.. దీపక్ తల్లి గాయత్రి దేవి రెండు నెలల క్రితం మరణించింది. ఆమెకు కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఆ అకౌంట్‌లో 1.13లక్షల కోట్లు (₹1,13,56,000 కోట్లు) క్రెడిట్ అయినట్లు ఫోన్‌కు నోటిఫికేషన్ రావడాన్ని దీపక్ గమనించాడు. ఆ మెస్సేజ్‌ను చూడగానే దీపక్ గందరగోళానికి గురయ్యాడు. అతను ఆ మొత్తాన్ని లెక్కించలేక పోయాడు. దీంతో తన స్నేహితులకు మెస్సేజ్ పంపించి ఎన్ని సున్నాలు ఉన్నాయి.. ఆ మొత్తం ఎంతో లెక్కించి చెప్పాలని కోరాడు.

తనకు వచ్చిన మెస్సేజ్ నిజమేనా అని తెలుసుకునేందుకు మంగళవారం ఉదయం దీపక్ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులు ఆ బ్యాలెన్స్ నిజంగానే అకౌంట్లో ఉన్నట్లు ధృవీకరించారు. కానీ, ఇది అనుమానాస్పద డిపాజిట్‌గా గుర్తించి బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఆ విషయాన్ని దీపక్ కు కూడా తెలియజేశారు. ఆ వెంటనే బ్యాంక్ సిబ్బంది ఆదాయపు పన్నుశాఖ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. దీంతో వారు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ విషయం వైరల్ కావడంతో దీపక్ బంధువులు, స్నేహితులు, అతనికి తెలిసిన వారినుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో అతను ఫోన్ ను స్విచ్ఛాఫ్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇలా జరగడానికి కారణం లావాదేవీల్లో సాంకేతిక లోపమా.. బ్యాంకింగ్ లోపం వల్ల అలా జరిగిందా.. అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి దర్యాప్తు తరువాత అసలు విషయం తెలుస్తుందని అధికారులు చెప్పారు.

ఈ విషయం తెలిసిన చాలా మంది ఇది నమ్మశక్యం కాని విషయం. ఇది కేవలం బ్యాంకు సాప్ట్‌వేర్‌లో లోపం లేదా మాన్యువల్ ఎంట్రీ తప్పు వల్ల జరిగి ఉంటుందని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం.. 20ఏళ్ల వ్యక్తి ఇప్పుడు అంబానీ కంటే ధనవంతుడు అయ్యాడంటూ చమత్కరించుకుంటున్నారు.