మా అమ్మ కోసం వరుడు కావాలి: కండిషన్స్ అప్లై

  • Published By: veegamteam ,Published On : November 2, 2019 / 05:00 AM IST
మా అమ్మ కోసం వరుడు కావాలి: కండిషన్స్ అప్లై

Updated On : November 2, 2019 / 5:00 AM IST

ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్ దర్శకత్వంలో 1984లో వచ్చిన స్వాతి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఓ కూతురు తన తల్లికి వరుడు కోసం వెతుకుతోంది. దీని కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కూతురు తల్లికోసం పడే తపనపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే..ఆస్తా వర్మ లా స్టూడెంట్. ఆమె తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లి ఒంటరి అయిపోతుంది. దీంతో తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం ‘మా అమ్మ కోసం అందమైన 50 ఏళ్ల వయస్సు మంచి  వరుడు కావాలి.అతను శాఖాహారి అయి ఉండాలి. మద్యం తాగకూడదు. జీవితంలో బాగా స్థిరపడి ఉండాలి’ అంటూ ఆస్తా వర్మ చేసిన ట్వీట్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.  

దీని కోసం ఆస్తా వర్మ గురువారం (అక్టోబర్ 31) తన తల్లితో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది. ఆమె ప్రయత్నం చాలా మంచిదని అంటున్నారు నెటిజన్లు. తమ స్వార్థం తాము చూసుకుంటు తల్లిదండ్రులను పట్టించుకోని ఈరోజుల్లో తల్లికి మళ్లీ పెళ్లి చేయాలనుకోవం..ఆమెకు ఓ తోడును వెతకటం మంచిదంటున్నారు. సాధారణంగా ఇచ్చే ప్రకటలు కాకుండా ట్విట్టర్ లో  భిన్నంగా ఆస్తా వర్మ ప్రయత్నించడం అందరినీ ఆకర్షించింది. 

నెటిజన్ల నుంచి చక్కటి స్పందన వచ్చింది. ఆమె ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. అమ్మ కోసం మంచి సంబంధం వెతికేందుకు పెండ్లి సంబంధాల వెబ్‌సైట్‌ను ఎందుకు వెళ్లలేదు అంటూ మరికొందరు ఆస్తా వర్మను ప్రశ్నించారు. దానికి ఆమె స్పందిస్తూ..ఆ ప్రయత్నం కూడా చేశాననీ కానీ ఫలితం దక్కలేదు. అందుకే ట్విట్టర్ వేదికగా ప్రకటించానని తెలిపింది. దీంతో కొంతమంది ఆస్తాను డైరెక్ట్ గా సంప్రదించారు. ఆమె స్పందన కోసం వెయిట్ చేస్తున్నారు.