Indigo Flight Services : నార్త్ గోవా నుంచి అబుదాబీకి నేరుగా ఇండిగో విమాన సర్వీసు

ఉత్తర గోవా విమానాశ్రయం నుంచి అబుదాబికి నేరుగా ఇండిగో విమాన సర్వీసును ప్రారంభించనున్నారు. ఉత్తర గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం సెప్టెంబర్ 2వతేదీ నుంచి వారానికి మూడుసార్లు అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా ఇండిగో విమాన సర్వీసును నడపనున్నారు....

Indigo Flight Services : నార్త్ గోవా నుంచి అబుదాబీకి నేరుగా ఇండిగో విమాన సర్వీసు

Indigo Flight Services

Updated On : August 29, 2023 / 6:15 AM IST

Indigo Flight Services : ఉత్తర గోవా విమానాశ్రయం నుంచి అబుదాబికి నేరుగా ఇండిగో విమాన సర్వీసును ప్రారంభించనున్నారు. ఉత్తర గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం సెప్టెంబర్ 2వతేదీ నుంచి వారానికి మూడుసార్లు అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా ఇండిగో విమాన సర్వీసును నడపనున్నారు. (North Goa Airport Announces Direct Indigo Flight Services)

Indonesia : ఇండోనేషియా బాలి సముద్రంలో భారీ భూకంపం… సునామీ హెచ్చరిక లేదు

మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అబుదాబికి ప్రారంభ ఇండిగో విమానం సెప్టెంబర్ 2 వతేదీ శనివారం ఉదయం 00:25 గంటలకు షెడ్యూల్ చేశామని విమానాశ్రయ ఆపరేటర్ జీఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీనియర్ అధికారి తెలిపారు. ఈ విమానం తెల్లవారుజామున 02:15 గంటలకు అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది.

Assam Floods : మళ్లీ అసోంలో వరదలు…15 మంది మృతి

ఈ ఇండిగో విమానం తిరిగి అబుదాబీ నుంచి 3.15 గంటలకు బయలు దేరి తిరిగి గోవాకు రానుంది. సోమ, గురు, శనివారాల్లో ఈ అబుదాబీ విమాన సర్వీసు నడుపుతామని ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. విస్తరిస్తున్న తమ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో అబుదాబీ ప్రముఖ గమ్య స్థానం అని జిజిఐఎఎల్ సిఇఒ ఆర్ వి శేషన్ చెప్పారు.