వనక్కం తంబీ…అమెరికాలో తమిళ భాష ప్రతిధ్వనిస్తోందన్న మోడీ

అమెరికా అంతటా తమిళ బాష ప్రతిధ్వనిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో తాను తమిళ కవి గురించి చేసిన ప్రస్తావన గురించి, అమెరికాలోని పలు వేదికలపై పలు సందర్భాల్లో తమిళ బాష ప్రాముఖ్యత గురించి తాను చేసిన వ్యాఖ్యలు మోడీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క వార్షిక కాన్వొకేషన్ వేడుకకు హాజరయ్యేందుకు తమిళనాడు రాజధాని చెన్నై చేరుకున్న మోడీ…తమిళం పురాతన భాషలలో ఒకటి అని, అందరికీ ఇది నేర్పించాలని తాను స్వయంగా చెప్పానని అన్నారు.
తాను అమెరికాలో ఉంటున్నప్పుడు…ఒకసారి తమిళ భాషలో మాట్లాడానని అన్నారు. ఇది ప్రాచీన భాషలలో ఒకటి అని అందరికీ చెప్పానని అన్నారు ఈ రోజు తమిళ భాష మొత్తం అమెరికాలో ప్రతిధ్వనిస్తుందని వనక్కం (హలో)తో తన సంక్షిప్త ప్రసంగాన్ని ప్రారంభించిన పిఎం మోడీ పెద్దగా ఉత్సాహంగా చెప్పారు.
ప్రధాని అమెరికా పర్యటనకు ముందు అమిత్ షా చేసిన వన్ నేషన్ వన్ ల్యాంగ్వేజ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. హిందీని తమపై బలవంతంగా రుద్దాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని దక్షిణాది రాష్ట్రాలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో షా వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు,ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ….తాను అలా అనలేదని, తాను నాన్ హిందీ రాష్ట్రం గుజరాత్ కు చెందిన వాడినేనని, మాతృభాషతో పాటు రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే సూచించానని అమిత్ షా తెలిపారు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి.. రాజకీయం చేయలని భావిస్తున్నారని అన్న విషయం తెలిసిందే.