White Fungus : మరో ముప్పు… వైట్ ఫంగస్.. ఇది బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్.. వీరికే ఎక్కువ వస్తుందట…

ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అదే వైట్ ఫంగస్. ఇది బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా బిహార్‌లో వైట్ ఫంగస్ కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ చాలా ప్రమాదకరమని వైద్యనిపుణులు చెప్పడం భయాందోళనలు పెంచింది.

White Fungus : మరో ముప్పు… వైట్ ఫంగస్.. ఇది బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్.. వీరికే ఎక్కువ వస్తుందట…

White Fungus

Updated On : May 20, 2021 / 9:15 PM IST

White Fungus More Dangerous : కరోనా మహమ్మారి విలయంతో యావత్ దేశం విలవిలలాడిపోతోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది చాలదన్నట్టు బ్లాక్ ఫంగస్ రూపంలో మరో ముప్పు వచ్చి పడింది. కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అదే వైట్ ఫంగస్. ఇది బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా బిహార్‌లో వైట్ ఫంగస్ కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ చాలా ప్రమాదకరమని వైద్యనిపుణులు చెప్పడం భయాందోళనలు పెంచింది.

కరోనా లక్షణాలతో వచ్చిన రోగులకు టెస్ట్ చేయగా కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. అనుమానంతో మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైట్ ఫంగస్‌ వచ్చినట్లు తేలిందని పట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రి, మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఎస్‌ఎస్ సింగ్ తెలిపారు. నలుగురికి వైట్ ఫంగస్ సోకినట్లు నిర్ధారణ అయిందని.. అలాంటి కేసులు మరికొన్ని ఉండొచ్చని ఆయన అన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే షుగర్ పేషెంట్లు, ఎయిడ్స్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందన్నారు.

వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు ఇతర ప్రధాన అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని డాక్టర్ సింగ్ చెప్పారు. సాధారణ కోవిడ్ లక్షణాలే ఉంటాయని.. ఎక్స్‌రే, సీటీ స్కాన్ ద్వారా వైట్ ఫంగస్‌ను గుర్తించవచ్చని వివరించారు. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించే సమయంలో నిర్లక్ష్యం కారణంగా వైట్ ఫంగస్ సోకే అవకాశముందన్నారు. ఆక్సిజన్ తయారీలో కుళాయి నీరు వాడుతున్నారని.. అందులో వైట్ ఫంగస్ ఉంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందని సింగ్ చెప్పారు.

సకాలంలో చికిత్స తీసుకోకపోతే వైట్ ఫంగస్ ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరించారు. బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ ప్రమాదకరం ఎందుకంటే.. ఊపిరితిత్తులను పై దాడి చేస్తుంది. అలాగే గోళ్లు, చర్మం, మూత్రపిండాలకు ఫంగస్ వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. కడుపు, మెదడు, మర్మాంగాలు, నోటికి వైట్ ఫంగస్ వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి వైట్ ఫంగస్ దాడి చేసే ప్రమాదం ఎక్కువ అన్నారు. వైట్ ఫంగస్ రోగులు యాంటీ ఫంగల్ మందులతో కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.