NPR రాష్ట్రపతితో మొదలు

  • Published By: madhu ,Published On : February 17, 2020 / 10:51 AM IST
NPR రాష్ట్రపతితో మొదలు

Updated On : February 17, 2020 / 10:51 AM IST

జాతీయ జనాభ గణన (NPR), పౌరసత్వ సవరణ చట్టం (NRC)లకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. దీనివల్ల ఎలాంటి భయం లేదని చెప్పుకొస్తోంది. పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. హింసాత్మకంగా మారి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే…NPR అప్‌డేట్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించడానికి కేంద్రం చర్యలు తీసుకొంటోంది. 

2020, ఏప్రిల్ 01వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. తొలుత న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేరును మొట్టమొదట జాబితాలో చేర్చనున్నారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్లను అధికారులు నమోదు చేస్తారు. రాష్ట్రపతితో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయాలు వెల్లడించాయి. ఎన్యుమరేషన్ కోసం అధికారులు వారింటికి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రయ సందర్భంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రులు సందేశం ఇవ్వనున్నారని సమాచారం. 

దీనికి సంబంధించిన ఫారాల ప్రింటింగ్ మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానుందని అంచనా. అయితే..ఇందులో తల్లిదండ్రుల జన్మస్థలం, ఇతర వివాదాస్పదమైన అంశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. తమ తల్లిదండ్రులు ఎక్కడ జన్మించారో తమకు ఎలా తెలుసని ప్రశ్నిస్తున్నారు. 

NRC, NPR చట్టాలను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వంపై పలు రాష్ట్రాలు గుస్సాగా ఉన్నాయి. ఈ చట్టాలను అమలు చేయవద్దని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాయి. NPR అప్ డేట్ ప్రక్రియ ఏప్రిల్ 01 నుంచి ప్రారంభం కానున్న సందర్భంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

Read More>> దిశ సినిమా : శంషాబాద్ ACPతో ఆర్జీవీ భేటీ