Commandos Drill : మీనాక్షి ఆలయంలో ఎన్ఎస్‌జీ కమాండోల డ్రిల్..
తమిళనాడులోని మధురైలో కొలువైన మీనాక్షి అమ్మవారి ఆలయంలో నేషనల్ సెక్యూర్టీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) కమాండోలు కౌంటర్ టెర్రరిజం డ్రిల్ చేపట్టారు. తమిళనాడు రాష్ట్ర పోలీసులతో కలిసి ఎన్ఎస్‌జీ దళాలు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

Commandos Drill In Meenakshi Temple
commandos counter terrorism drill at meenakshi temple : తమిళనాడులోని మధురైలో కొలువైన మీనాక్షి అమ్మవారి ఆలయంలో నేషనల్ సెక్యూర్టీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) కమాండోలు కౌంటర్ టెర్రరిజం డ్రిల్ చేపట్టారు. తమిళనాడు రాష్ట్ర పోలీసులతో కలిసి ఎన్ఎస్‌జీ దళాలు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
శుక్రవారం (ఆగస్టు 6,2021)రాత్రి పూట ఎన్ఎస్‌జీ కమాండోలు డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు దాడి చేస్తే, ఎటువంటి యాక్షన్ చేపట్టాలన్న దానిపై కమాండోలు ప్రిపేరయ్యారు. అటాక్ సమయంలో ప్రజలను ఎలా రక్షించాలన్న కోణంలోనూ కమాండోలు ఆ డ్రీల్‌లో చేశారు.కాగా పలు ఆలయాల్లో కమాండోలు ఇటువంటి డ్రిల్స్ నిర్వహించటం జరుగుతుంటుంది.
ఉగ్రవాదులు దాడులుచేస్తే భక్తులు వారి నుంచి ఎలా తప్పించుకోవాలి. అటువంటి విపత్కర సమాయాల్లో ఎలా అప్రమత్తంగా ఉండాలి?భక్తుల్ని ఎలా కాపాడాలి?అనే అంశాలపై పలు దేవాలయాల్లో కమాండోలు కౌంటర్ టెర్రరిజం డ్రిల్ నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే.అలాగే పలు ప్రభుత్వా కార్యాలయాల్లో కూడా కమాండోలు ఇటువంటి డ్రిల్ నిర్వహిస్తుంటారు.