Covid Coma : 28 రోజులుగా కోమాలో…వయగ్రా ఇచ్చిన తర్వాత కోలుకున్న నర్సు

చికిత్సలో భాగంగా...శృంగార సామర్థ్యాన్ని పెంచే వయగ్రాను ఆమెకు అధిక మోతాదులో ఇచ్చారు. డిసెంబర్ 14వ తేదీన కోమా నుంచి కోలుకుని ఇంటికి చేరుకుందని వైద్యులు తెలిపారు...

Covid Coma : 28 రోజులుగా కోమాలో…వయగ్రా ఇచ్చిన తర్వాత కోలుకున్న నర్సు

Viagra

Updated On : January 5, 2022 / 11:29 AM IST

Viagra Nurse : దాదాపు 28 రోజుల పాటు కోమాలో ఉన్న నర్సుకు అధికమొత్తంలో వయగ్రా ఇవ్వడంతో కోలుకున్నారు. యూకేలో చోటు చేసుకున్న ఈ ఘటన వైద్య శాస్త్ర ప్రముఖులను ఆశ్చర్యచకితులను చేసింది. ఇదొక మిరాకిల్ అంటున్నారు. యూకేలోని లింకన్ షైర్ లో మోనికా అల్మేడా (37) నివాసం ఉంటున్నారు. నవంబర్ 09వ తేదీన ఈమె కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేరారు. కానీ..ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో..కోమాలోకి వెళ్లిపోయారు. ఆమె కోలుకోవడానికి డాక్టర్లు శతవిధాల ప్రయత్నించారు. కానీ..వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Read More : 14-day Quarantine : కరోనా నుంచి 7 రోజుల్లోనే కోలుకుంటే.. 14 రోజులు క్వారంటైన్ తప్పనిసరి!

చికిత్సలో భాగంగా…శృంగార సామర్థ్యాన్ని పెంచే వయగ్రాను ఆమెకు అధిక మోతాదులో ఇచ్చారు. డిసెంబర్ 14వ తేదీన కోమా నుంచి కోలుకుని ఇంటికి చేరుకుందని వైద్యులు తెలిపారు. శరీరంలోని ధమనులను మరింత ఉద్వేగానికి గురి చేసి…రక్తప్రసరణ సాఫీగా జరిగి కోమా నుంచి బయటపడిందన్నారు. ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవడానికి ఉపయోగించవచ్చో..లేదో తెలుసుకోవడానికి పలు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. ఆమె కోలుకోవడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.