14-day Quarantine : కరోనా నుంచి 7 రోజుల్లోనే కోలుకుంటే.. 14 రోజులు క్వారంటైన్ తప్పనిసరి!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం భారత్ సహా ప్రపంచ దేశాలు పలుచోట్ల లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు విధిస్తున్నాయి.

14-day Quarantine : కరోనా నుంచి 7 రోజుల్లోనే కోలుకుంటే.. 14 రోజులు క్వారంటైన్ తప్పనిసరి!

14 Day Quarantine A Must For Covid Patients Even If They Recover Within 7 Days Who

14-day Quarantine : ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం భారత్ సహా ప్రపంచ దేశాలు పలుచోట్ల లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొంతమందికి కరోనా సోకిన కొద్దిరోజులకే వెంటనే కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ వైరస్ తీవ్రత తక్కువగానే కనిపిస్తోంది. కరోనా సోకినప్పటికీ కొద్దిరోజులకే కోలుకుంటున్నారు.

ఇలా తక్కువ సమయంలోనే కోలుకునేవారు కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ మేరకు WHO ప్రోటోకాల్‌లను సమీక్షించింది. కరోనా నుంచి కోలుకున్న బాధితులందరికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. కరోనా లక్షణాలు ప్రారంభమైన ఐదు నుంచి ఏడు రోజులలోపు కరోనా బాధితులు కోలుకున్నప్పటికీ.. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా ఉండాలని ఆరోగ్య సంస్థ తెలిపింది. కొవిడ్ ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ టీమ్ అబ్ది మహముద్ ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతంలోని వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా క్వారంటైన్ వ్యవధిపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. కరోనా కేసులు తక్కువ ఉన్న దేశాలలోనూ ఎక్కువ రోజులు క్వారంటైన్ సమయాన్ని పెంచడం ద్వారా కరోనా కేసుల సంఖ్యను తగ్గించవచ్చునని తెలిపారు. కరోనా కొత్త కేసులు తక్కువగా నమోదయ్యే దేశాల్లో చిన్నపాటి క్వారంటైన్ల ద్వారా వైరస్ తీవ్రతను తగ్గించవచ్చునని ఆయన తెలిపారు.

ఇన్‌ఫ్లూయింజా, కొవిడ్-19 రెండింటి ద్వారా సోకే అవకాశం ఉందని WHO అధికారి చెప్పారు. ఈ రెండూ వేర్వేరు వైరస్‌లు అయినప్పటికీ.. శరీరంలోకి ప్రవేశించి వివిధ మార్గాల్లో దాడి చేస్తాయి. అలా రూపాంతరం చెంది మరో కొత్త వైరస్ గా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. WHO ప్రకారం.. డిసెంబర్ 29, 2021 నాటికి, దాదాపు 128 దేశాలు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించిన ఒమిక్రాన్ కేసులలో గణనీయంగా పెరిగాయి. ఆస్పత్రుల్లో చేరడం, మరణాల రేట్లు తక్కువగా ఉన్నాయి.

ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల కంటే ఎగువ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనే వాస్తవాన్ని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అధిక-ప్రమాదం ఉన్న వ్యక్తులు, టీకాలు వేయని వారు ఒమిక్రాన్ సోకితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కొన్ని వారాల వ్యవధిలో ఇతర స్ట్రెయిన్లను అధిగమించగలదని ఆయన చెప్పారు. డెన్మార్క్‌లో, ఆల్ఫా వేరియంట్‌తో కేసు సంఖ్యలు రెట్టింపు కావడానికి రెండు వారాలు పట్టిందని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్‌ కేవలం రెండు రోజులు వ్యవధలోనే రెట్టింపు అయ్యాయని ఆయన చెప్పారు.

Read Also : Omicron Kamareddy : కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు