Omicron Kamareddy : కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు

కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించారు. ఎల్లారెడ్డికి చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

Omicron Kamareddy : కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు

Kamareddy

first omicron case in Kamareddy : తెలంగాణలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజు రోజుకు వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసును గుర్తించారు. దీంతో కలిపి నిన్నటివరకు రాష్ట్రంలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 94కి చేరింది.

ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి నిన్న 127 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా 8 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. సాధారణ కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా భయపడుతున్నాయి.

Annamayya Route : తిరుమలలో అన్నమయ్య మార్గంపై కొత్త రగడ
కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఎల్లారెడ్డికి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మూడు రోజుల క్రితం శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. చికిత్స కోసం బాధితున్ని హైదరాబాద్‌కు తరలించారు. అతనికి ఒమిక్రాన్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ముందు జాగ్రత్ర చర్యగా గ్రామంలో శానిటైజేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రెండు రోజుల క్రితం వందల్లో నమోదైన రోజువారీ కేసులు.. ఇప్పుడు వేలల్లోకి పరుగులు తీశాయి. తెలంగాణలో కొత్తగా 1,052 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల 858 ఉండగా.. ఇప్పటివరకు 4 వేల 33 మంది కోవిడ్‌తో చనిపోయారు.