Annamayya Route : తిరుమలలో అన్నమయ్య మార్గంపై కొత్త రగడ

ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. తిరుపతిలోని తమ దుకాణాలు, హోటళ్లు, ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ రాజకీయ నాయకులకు సున్నితమైన అంశంగా మారింది.

Annamayya Route : తిరుమలలో అన్నమయ్య మార్గంపై కొత్త రగడ

Tirumala

Controversy on the Annamayya route : తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు నిర్మాణంపై కొత్త రగడ మొదలైంది. తిరుపతి వాసులు, స్థానిక నేతలు అన్నమయ్య మార్గాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మార్గం వలన తిరుపతి నగరం తన చారిత్రక వైభవం కోల్పోతుందన్న వాదన తెరపైకి వస్తోంది. ఇది అలిపిరి మార్గం ఉనికికే ప్రమాదమని కొందరంటున్నారు.

ఈ మార్గం అభివృద్ధి చేస్తే.. రేణిగుంట విమానాశ్రయంలో దిగే భక్తులతో పాటు కడప, కర్నూలు, హైదరాబాద్‌, నెల్లూరు, ప్రకాశం, తమిళనాడు నుంచి వచ్చే భక్తులంతా.. మామండూరు మార్గం వైపు నుంచి తిరుమల చేరుకుంటారని చెబుతున్నారు. వాళ్లంతా.. తిరుపతి వైపు కన్నెత్తి చూడరని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Opinion Poll : అమరావతి కార్పొరేషన్‌పై అభిప్రాయ సేకరణ

ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. తిరుపతిలోని తమ దుకాణాలు, హోటళ్లు, ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ రాజకీయ నాయకులకు సున్నితమైన అంశంగా మారింది. ఈ వివాదంలోకి తమను లాగొద్దని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. మరోవైపు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం.. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

చారిత్రక మార్గాన్ని.. ఘాట్‌ రోడ్‌గా అభివృద్ధి చేయడంలో తప్పులేదన్నారు. అయితే తిరుపతి వాసుల అభ్యంతరాలతో.. అన్నమయ్య కాలిబాట మార్గం అభివృద్ధి చర్చనీయాంశమైంది. ఈ విషయంలో.. టీటీడీ ఎలా ముందుకెళ్తుందన్నది ఆసక్తిగా మారింది.