Private schools: తల్లిదండ్రులకు ఊరట.. స్కూలు ఫీజులు 15శాతం రద్దు.. ప్రభుత్వం ఆదేశాలు
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ పిల్లలు దాదాపుగా రెండేళ్ల నుంచి చదువులకు దూరమయ్యారు. అయితే ప్రైవేటు పాఠశాలు మాత్రం ఆన్‌లైన్ క్లాసులు పేరుతో ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి. పనుల్లేక, జీతాల్లేక చాలామంది కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు.

Odisha govt reduces tuition fee in all private schools
Odisha govt reduces tuition fee: కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ పిల్లలు దాదాపుగా రెండేళ్ల నుంచి చదువులకు దూరమయ్యారు. అయితే ప్రైవేటు పాఠశాలు మాత్రం ఆన్‌లైన్ క్లాసులు పేరుతో ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి. పనుల్లేక, జీతాల్లేక చాలామంది కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలోనూ పిల్లలు ఫీజలు కట్టాలంటే తల్లిదండ్రులకు భారంగా మారింది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులను 15 శాతం రద్దు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులపై స్వల్పంగా భారం తగ్గగా.. ఫీజుల వసూలు ఒప్పందంపై సంతకం చేసినవారు ఆ ప్రకారమే ఫీజులు వసూలు చేయవలసి వస్తుంది. 15 శాతం ఫీజు రద్దు చేయాలని రాష్ట్ర పాఠశాలలకు సామూహిక విద్యా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. విద్యా సంవత్సరం పొడవునా తరగతుల నిర్వహణపై కోవిడ్-19 ఆంక్షలు ప్రభావం చూపగా.. ఈ పరిస్థితుల్లో ఫీజులు వసూలు చేయడం పట్ల దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల సంఘం అభ్యర్థనపై హైకోర్టు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యింది.
ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు ఉపశమనం కోసం ఓ కమిటీని క్రియేట్ చెయ్యాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, తల్లిదండ్రుల సంఘం, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రతినిధులతో కలిపి రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. స్కూలు ఫీజుల్లో 15శాతం ఫీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ ఇప్పటికే ఫీజులను ఎవరైనా కట్టి ఉంటే.. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు వారికి మినహాయించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.