మూగజీవులకు ఆహారం కోసం…1.34కోట్లు విడుదల చేసిన ఒడిషా

  • Published By: veegamteam ,Published On : April 17, 2020 / 05:24 AM IST
మూగజీవులకు ఆహారం కోసం…1.34కోట్లు విడుదల చేసిన ఒడిషా

Updated On : April 17, 2020 / 5:24 AM IST

 కరోనా వైరస్ నేపథ్యంలో భారత్.. దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. వైరస్ కేసులు పెరుగుతుండటంతో  మే3, 2020 వరకు లాక్ డౌన్  పొడిగిస్తున్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల కార్మికులతో సహా పలుచోట్ల ప్రజలు ఆహారం దొరక్క ఆకలితో అలమంటిచిపోతున్న విషయం తెలిసిందే.

అయితే మనుషులే కాదు మూగజీవులు కూడా ఆహారం దొరక్కా అలమటిస్తున్నాయి. ఆకలేస్తుందని నోరు తెరిచి అడగలేని వీధి కుక్కలు, ఇతర వన్యప్రాణులు ఆకలితో అలమటించిపోతున్నాయి. అయితే వీటి ఆకలి తీర్చేందుకు ఒడిషా ప్రభుత్వం నిధులు కేటాయించింది. లాక్ డౌన్ వల్ల మనుషులే కాదు మూగజీవులు కూడా పస్తులుండటానికి వీల్లేదని భావించిన నవీన్ పట్నాయక్ సర్కార్ వాటికి ఆహారం అందించటం కోసం రూ. 80 లక్షల అదనపు నిధులను విడుదల చేసింది.

ఇప్పటికే మూగజీవులకు ఆహారం కోసం రూ.54 లక్షలు మంజూరు చేసిన బిజూ జనతాదళ్ ప్రభుత్వం…ఇప్పుడు ఛీప్ మినిస్టర్ రీలిఫ్ ఫండ్ (CMRF)నుంచి అదనంగా రూ. 80 లక్షల 18 వేల నిధులను విడుదల చేసింది. విధి కుక్కలకు, ఇతర వన్యప్రాణులకు ఆహారం అందించటం కోసం పట్టణ స్ధానిక సంస్ధలు, ఐదు మునిసిపల్ కార్పొరేషన్లు, 48 మునిసిపాలిటీలు, 61 ఎన్ఐసిలకు  ఈ నిధులను అందించబడ్డాయి. ఇప్పటివరకు ఒడిశాలో 60 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఒక కరోనా మరణం నమోదైంది.