Odisha : భువనేశ్వర్‌లో 48 గంటలుగా నిలిచిపోయిన ఏపీ కోడిగుడ్ల లారీలు
48 గంటలుగా కోడిగుడ్లతో ఉన్న 300 లారీలు నిలిచిపోయాయి. 2 కి.మీటర్ల మేర జాతీయ రహదారిపై లారీలు నిలిచిపోయాయి...ఏపీ రాష్ట్రం నుంచి కోడిగుడ్ల దిగుమతితో రేట్లు మరింత పడిపోయాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కోళ్ల దాణా పెరుగుదలతో భారీగా...

Egss
AP Egg Lorries : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎన్నో వస్తువులు ఎగుమతులు, దిగుమతులు అవుతుంటాయి. అలాగే కోడిగుడ్లు, చికెన్, చేపలు కూడా ఆంధ్రా రాష్ట్రం నుంచి ఉత్తర భారతదేశం వైపుకు వందలాది లారీలు వెళుతుంటాయనే సంగతి తెలిసిందే. ఇలాగే కోడిగుడ్లు, చికెన్, చేపలు ఇతర ఆహార పదార్థాలు ఆంధ్రా నుంచి వందలాది లారీలు ఉత్తర భారతదేశం వైపుకు వెళుతుంటాయి. అలాగే కోడిగుడ్ల లారీలు కూడా ఏపీ నుంచి ఒడిశా, బీహార్, బెంగాల్, అసోంకి లారీలు వెళ్లాయి. కానీ.. భువనేశ్వర్ లో ఈ లారీలు నిలిచిపోయాయి.
Read More : world Most Expensive Mangoes : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు..కిలో 2.70 లక్షలు..
వీటిని ఒడిశా వ్యాపారులు అడ్డుకున్నారు. దాదాపు 48 గంటలుగా కోడిగుడ్లతో ఉన్న 300 లారీలు నిలిచిపోయాయి. 2 కి.మీటర్ల మేర జాతీయ రహదారిపై లారీలు నిలిచిపోయాయి. దీనికి కారణం ఒడిశాలో కోడిగుడ్ల రేట్లు తగ్గిపోయాయి. దీంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ రాష్ట్రం నుంచి కోడిగుడ్ల దిగుమతితో రేట్లు మరింత పడిపోయాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కోళ్ల దాణా పెరుగుదలతో భారీగా నష్టపోవడం జరిగిందని వాపోతున్నారు. ప్రతి కోడి గుడ్డుకు ఓ రేటును నిర్ణయించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇక గంటల తరబడి లారీలు నిలిచపోవడంతో డ్రైవర్, క్లీనర్, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటే.. కోడి గుడ్లు పాడైపోతాయని వెల్లడిస్తున్నారు.